Kohli 28th Test hundred: మూడేళ్ల నిరీక్షణకు తెర.. టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ-virat kohli slams 28th test hundred in 4th test against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Slams 28th Test Hundred In 4th Test Against Australia

Kohli 28th Test hundred: మూడేళ్ల నిరీక్షణకు తెర.. టెస్టుల్లో 28వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ

Maragani Govardhan HT Telugu
Mar 12, 2023 01:15 PM IST

Kohli 28th Test hundred: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత సెంచరీ సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో తన 28వ సెంచరీ చేసిన విరాట్‌కు ఓవరాల్‌గా ఇది 75వ అంతర్జాతీయ శతకం.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (REUTERS)

Kohli 28th Test hundred: టెస్టుల్లో మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. అసలైన టెస్టు మజాను చూపిస్తూ నిలకడైన ఆటతీరుతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు కోహ్లీ. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అదరగొట్టాడు. మూడో రోజు ఆటలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు.. నాలుగో రోజు నిలకడగా రాణిస్తూ సెంచరీని నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో తన 28వ శతకాన్ని అందుకున్నాడు. ఓవరాల్‌గా 75వ ఇంటర్నేషనల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

- కోహ్లీ 241 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 5 బౌండరీలు ఉన్నాయి. నిలకడగా బ్యాటింగ్ ఆడుతూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. విరాట్ తన కెరీర్‌లో ఎక్కువ బంతులాడి సెంచరీ అందుకోవడం ఇది రెండో సారి మాత్రమే. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో శతకం కోసం 289 బంతులాడాడు. ఆ తర్వాత ఈ మ్యాచ్‌లోనే ఎక్కువ బంతులు ఎదుర్కొన్నాడు.

- ఇది కాకుండా ఓ ప్రత్యర్థి అత్యధిక అంతర్జాతీయ శతకాలు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాపై 16, శ్రీలంకపై 16 సెంచరీలు సాధించాడు కోహ్లీ. అగ్రస్థానంలో సచిన్ తెందూల్కర్ ఆస్ట్రేలియా 20 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ తర్వాత బ్రాడ్‌మన్ ఇంగ్లాండ్‌పై 19 శతకాలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ సచినే శ్రీలంకపై 17 సెంచరీలు నమోదు చేశాడు.

- సెంచరీ చేయడానికి కోహ్లీ ఎక్కువ ఇన్నింగ్స్‌ తీసుకోవడం ఇదే మొదటి సారి. తన 27వ, 28 శతకానికి మధ్య 41 ఇన్నింగ్సులు ఆడాడు. 11, 12 శతకానికి మధ్య 11 ఇన్నింగ్సులు ఆడాడు.

ప్రస్తుతం ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 110 పరుగులతో నిలకడగా రాణిస్తుండగా.. అక్షర్ పటేల్ 11 పరుగులతో అతడికి సహకరిస్తున్నారు. వీరిద్దరూ చెత్తబంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లాలంటే ఇంకో 64 పరుగులు చేయాల్సి ఉంది.

WhatsApp channel