Virat Kohli in ICC T20 Rankings: సెంచరీతో టీ20 ర్యాంకుల్లో పైకి దూసుకెళ్లిన విరాట్ కోహ్లి
Virat Kohli in ICC T20 Rankings: టీ20ల్లో తొలి సెంచరీతో తాజా ర్యాంకుల్లో పైకి దూసుకెళ్లాడు విరాట్ కోహ్లి. ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ టీమ్‌పై విరాట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.
Virat Kohli in ICC T20 Rankings: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలుసు కదా. ఈ టోర్నీలోనే అతడు టీ20ల్లో తొలి సెంచరీ చేశాడు. దీంతో తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి ఏకంగా 14 స్థానాలు పైకి దూసుకెళ్లాడు. గత వారం 29వ ర్యాంకులో ఉన్న విరాట్.. తాజా ర్యాంకుల్లో 15వ స్థానానికి చేరుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
గత కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి.. టీ20 ర్యాంకుల్లో 29వ స్థానానికి దిగజారిన విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై చేసిన సెంచరీతో అతడు ర్యాంకుల్లో పైకి దూసుకెళ్లాడు. టీ20ల్లో అతనికిదే తొలి సెంచరీ కాగా.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 1019 రోజుల తర్వాత విరాట్ చేసిన సెంచరీ కూడా ఇదే కావడం విశేషం.
అంతేకాదు ఆసియాకప్‌తో కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సెంచరీ కాకుండా మరో రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన వాళ్లలో రెండోస్థానంలో నిలిచాడు. వచ్చే నెలలోనే టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కోహ్లి ఫామ్‌లోకి రావడం ఇండియన్ టీమ్‌కు కలిసొచ్చేదే. ఇక తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీలంక బౌలర్ హసరంగా మూడు స్థానాలు మెరుగుపరచుకొని ఆరో స్థానానికి చేరాడు.
ఆల్‌రౌండర్ల లిస్ట్‌లోనూ ఏడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఫైనల్లో మూడు వికెట్లు తీసిన హసరంగ శ్రీలంక విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్లలో బంగ్లాదేశ్‌కు చెందిన షకీబుల్ హసన్ మళ్లీ మొదటి స్థానానికి వచ్చాడు. ఆసియాకప్‌లో బంగ్లా కెప్టెన్‌గా ఉన్న షకీబ్.. ఈ టోర్నీలోనే టీ20ల్లో 6 వేల రన్స్, 400 వికెట్లు తీసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.