Virat Kohli fans troll Virat Kohli: నోర్మూసుకో.. సూర్య కాదు.. నువ్వే నంబర్‌ వన్‌ అంటూ కోహ్లికి అభిమాని క్లాస్‌-virat kohli fans troll virat kohli over his tweet about suryakumar ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Fans Troll Virat Kohli Over His Tweet About Suryakumar

Virat Kohli fans troll Virat Kohli: నోర్మూసుకో.. సూర్య కాదు.. నువ్వే నంబర్‌ వన్‌ అంటూ కోహ్లికి అభిమాని క్లాస్‌

Hari Prasad S HT Telugu
Nov 21, 2022 02:50 PM IST

Virat Kohli fans troll Virat Kohli: నోర్మూసుకో.. సూర్య కాదు.. నువ్వే నంబర్‌ వన్‌ అంటూ కోహ్లికి అతని అభిమానే క్లాస్‌ పీకడం ఇప్పుడు వైరల్‌గా మారింది. సూర్యను పొగుడుతూ కోహ్లి ట్వీట్‌ చేయడమే దీనికి కారణం.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

Virat Kohli fans troll Virat Kohli: విరాట్‌ కోహ్లి అభిమానులు విరాట్‌ కోహ్లిని కూడా వదలకుండా ట్రోల్‌ చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఫన్నీ ట్వీట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్‌ 51 బాల్స్‌లోనే 111 రన్స్‌ చేసిన సంగతి తెలుసు కదా.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌ తర్వాత విరాట్‌ ఓ ట్వీట్‌ చేశాడు. "నంబర్‌ వన్‌ బ్యాటర్‌ తాను ఎందుకు వరల్డ్‌ బెస్టో చూపించాడు. లైవ్‌ మ్యాచ్ చూడలేదు కానీ ఇది కచ్చితం అతని మరో వీడియో గేమ్‌ ఇన్నింగ్సే అయి ఉంటుంది" అని విరాట్‌ చేసిన ట్వీట్‌ మొదట వైరల్ అయింది. అయితే ఈ ట్వీట్‌ చూసిన ఓ కోహ్లి అభిమానికి మాత్రం మండింది. అతడు కాదు నువ్వే నంబర్‌ వన్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.

"ప్రపంచంలో నువ్వే బెస్ట్‌, నోర్మోసుకో" అంటూ ఆ ఫ్యాన్‌ ట్వీట్‌ చేయడం విశేషం. విరాట్‌ ట్వీట్‌ కంటే కూడా ఈ అభిమాని ట్వీట్‌ మరింత వేగంగా వైరల్‌ అయింది. విరాట్‌ కోహ్లి అభిమానులు అతన్ని కూడా వదలడం లేదంటూ పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేశారు.

ఈ ట్వీట్‌ చూసి అభిషేక్‌ ముఖర్జీ అనే వ్యక్తి ట్వీట్‌ చేస్తూ.. కొంతకాలంగా విరాట్‌ కోహ్లి అభిమానులు తన నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ కోహ్లి రూపంలోనే తనకో కంపెనీ దొరకిందని సరదాగా ట్వీట్‌ చేశాడు. కోహ్లి ఫ్యాన్స్‌ కోహ్లిని కూడా వదలరు అంటూ మరో వ్యక్తి ట్వీట్‌ చేయడం విశేషం.

నిజానికి టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్‌ కోహ్లి.. టీ20 స్పెషలిస్ట్‌ సూర్యను కూడా మించిపోయాడు. 296 రన్స్‌తో ఇండియా తరఫున అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సూర్య కూడా అతని తర్వాతే రెండోస్థానంలో నిలిచాడు. అయితే ఆదివారం న్యూజిలాండ్‌పై సూర్య ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం హైలైట్‌ అనే చెప్పాలి. సహచర బ్యాటర్లంతా తడబడిన వేళ ఒంటిచేత్తో ఇండియాకు 191 రన్స్‌ భారీ స్కోరు అందించాడు.

అతని మెరుపులతో 65 రన్స్‌తో గెలిచిన ఇండియా సిరీస్‌లో 1-0 లీడ్‌ సాధించింది. తొలి టీ20 రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇండియా సిరీస్ కోల్పోయే అవకాశమైతే లేదు.

WhatsApp channel