Virat Kohli Dance: ఈడెన్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్
Virat Kohli Dance: ఈడెన్‌లో అదిరిపోయే స్టెప్పులేశారు విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్. గురువారం (జనవరి 12) ఇండియా, శ్రీలంక మధ్య రెండో వన్డే మ్యాచ్ మధ్యలో జరిగిన లేజర్ షోలో ఈ ఇద్దరి డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Virat Kohli Dance: శ్రీలంకతో మరో వన్డే మిగిలి ఉండగానే ఇండియా సిరీస్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో 2-0 తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. గురువారం (జనవరి 12) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంకను 4 వికెట్లతో ఓడించిన టీమిండియా.. తర్వాత ఈ సిరీస్ విజయాన్ని బాగానే ఎంజాయ్ చేసింది.
ఈ మ్యాచ్ మధ్యలో ఈడెన్ గార్డెన్స్‌లో కళ్లు చెదిరే లేజర్ షో ఏర్పాటు చేశారు. ఓవైపు ఈ లేజర్ షో జరుగుతుండగానే.. మరోవైపు ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి కలిసి స్టెప్పులేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. స్టాండ్స్‌లోని అభిమానులు ఈ వీడియో తీశారు. ఇషాన్, విరాట్ ఇద్దరూ డగౌట్ వైపు వెళ్తూ ఉత్సాహంగా ఒకే రకమైన స్టెప్పులు వేశారు.
ఇద్దరూ కలిసి అంతకుముందే స్టెప్పులు ప్రాక్టీస్ చేసినట్లు ఒకే సమయానికి ఒకే రకంగా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఈ రెండో వన్డేలో కేఎల్ రాహుల్ చివరి వరకూ క్రీజులో ఉండి ఇండియన్ టీమ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మొదట్లోనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడినట్లు కనిపించింది.
అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్.. మొదట హార్దిక్ పాండ్యాతో, తర్వాత కుల్దీప్ యాదవ్‌తో కలిసి టీమ్‌ను గెలిపించాడు. తొలి వన్డే కూడా గెలిచిన ఇండియా ఈ విజయంతో సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇప్పటికే శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కూడా 2-1తో గెలిచింది. మూడో వన్డే ఈ నెల 15న జరగనుంది.
సంబంధిత కథనం