MS Dhoni: ధోనీతో సైఫ్.. దిగ్గజలంతా ఒకే చోట.. తైమూర్‌తో కరీనా.. పిక్ వైరల్-viral pic of ms dhoni and saif ali khan in first odi of india nd england ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni: ధోనీతో సైఫ్.. దిగ్గజలంతా ఒకే చోట.. తైమూర్‌తో కరీనా.. పిక్ వైరల్

MS Dhoni: ధోనీతో సైఫ్.. దిగ్గజలంతా ఒకే చోట.. తైమూర్‌తో కరీనా.. పిక్ వైరల్

Maragani Govardhan HT Telugu
Published Jul 13, 2022 01:43 PM IST

మంగళవారం ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హాజరయ్యారు. అతడితో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్, విండీస్ మాజీ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ వచ్చారు. వీరంతా కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ పిక్చర్ వైరల్ అవుతోంది.

<p>ధోనీతో సైఫ్</p>
ధోనీతో సైఫ్ (Twitter)

లండన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్‌ను 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌కు పలువురు క్రీడా, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, బాలీవుడ్ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వెస్టిండీస్ దిగ్గజం, మాజీ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా వీరంతా కలిసి ఓ ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సైఫ్ అలీ ఖాన్, ఎంఎస్ గోర్డాన్ గ్రీనిడ్జ్ కలిసి ఫొటో దిగడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా రంగాల్లో ప్రముఖులైన వీరంతా ఒకే చోట కలవడంతో అభిమానులకు కన్నుల పండుగ వలే ఉంది. నెటిజన్లు ఈ ఫొటోపై విశేషంగా స్పందిస్తున్నారు. లైక్లు, షేర్ల వర్షంతో ముంచెత్తుతున్నారు. కరీనా కపూర్ కూడా గోర్డాన్‌తో సైఫ్ దిగిన ఫొటోను షేర్ చేసింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్, ధావన్ నిలకడగా ఆడి వికెట్ కోల్పోకుండా 111 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ముఖ్యంగా రోహిత్ మాత్రం లక్ష్యం చిన్నదైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మరోపక్క ధావన్ 58 బంతుల్లో 31 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా తన పదునైన బంతులతో నిప్పులు చెరగడంతో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆరు వికెట్లతో విరుచుకుపడ్డాడు. మరో బౌలర్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రసిధ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం