Under 19 Women's World Cup IND vs SA: అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ సూపర్ 6 రౌండ్‌లో టీమ్ ఇండియా తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది . ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో 59 పరుగులు మాత్రమే చేసింది. ,రాజపక్స 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. టీమ్ ఇండియా బౌలర్ పార్షవీ గౌరవ్ చోప్రా నాలుగు ఓవర్లు వేసి ఐదు రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు దక్కించుకున్నది. ఆమె ధాటికి శ్రీలంక టాప్ ఆర్డర్ విలవిలలాడింది. సంజీవ్ కశ్యప్ రెండు వికెట్లు తీసుకున్నది. శ్రీలంక విధించిన స్వల్ప టార్గెట్‌ను టీమ్ ఇండియా 7. 2 ఓవర్లలోనే ఛేదించింది. ,షెఫాలీ వర్మ 15 రన్స్, సంజయ్ షెరావట్ 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. సౌమ్య మనీష్ తివారీ 15 బాల్స్‌లో ఐదు ఫోర్లతో 28 పరుగులు చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించింది. సూపర్ సిక్స్ రౌండ్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.