India vs South Africa 3rd ODI: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా టాస్ ఆలస్యం కానుంది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్నందున పిచ్‌పై కవర్లు ఉంచారు. వర్షం కారణంగా దిల్లీ అరుణ్ జైట్లీ మైదానం తడిగా మారింది. ఫలితంగా టాస్ ఆలస్యం కానుంది. సిబ్బంది పిచ్‌ను మ్యాచ్ కోసం సిద్ధం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఔట్ ఫీల్డ్ తడిగా ఉన్నందున మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఫలితంగా ఓవర్ల కోత విధించే అవకాశముంది.,ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ యోచిస్తోంది. ఇప్పటికే ఇరుజట్లు 1-1 తేడాతో సమంగా ఉన్న నేపథ్యంలో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో సత్తాచాటాలని ఆశపడుతున్నాయి. గత మ్యాచ్ వైఫల్యం నుంచి తేరుకుని ఇందులో విజయం సాధించాలనే పట్టుదలో దక్షిణాఫ్రికా ఉంది.,గత మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలమైనప్పటికీ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో విజృంభించగా.. ఇషాన్ కిషన్ అద్బుత అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లోనూ బ్యాటర్లతో పాటు బౌలర్లూ సత్తా చాటి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.,మరోపక్క బ్యాటింగ్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ విఫలం కావడం అభిమానులను నిరాశ పరుస్తోంది. అతడు బ్యాట్ ఝుళిపించాల్సిన ఆవశ్యకత ఉంది. మరోపక్క వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పటికే శాంసన్, శ్రేయాస్, శుభ్‌మన్ గిల్ ఆ పనిలో ఉన్నారు.,అనారోగ్యం కారణంగా కెప్టెన్ టెంబా బవుమా రెండో వన్డేకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌కు అతడు తిరిగి వచ్చే అవకాశముంది. పర్యాటక జట్టుకు కూడా సిరీస్‌పై సమానావకాశాలు ఉన్నందున ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.,