Sports Stars.. ఒకప్పుడు ఆటలంటే కేవలం ఆరోగ్యం కోసమే. కానీ ఇప్పుడు స్పోర్ట్స్‌ను కెరీర్‌గా తీసుకునే వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. నిజానికి ఇండియాలాంటి దేశాల్లో మన క్రికెటర్ల సంపాదన చూసి మనం నోరెళ్లబెడుతున్నాం కానీ.. గోల్ఫ్, సాకర్, బాస్కెట్‌బాల్, టెన్నిస్‌లాంటి స్పోర్ట్స్‌స్టార్లు సంపాదిస్తున్నదాంతో పోలిస్తే క్రికెటర్ల సంపాదన ఏ మూలకూ సరిపోదు.,ప్రపంచంలోని టాప్ 10 రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ జాబితాలో ఒక్క క్రికెటరూ లేడు కదా వీళ్లకు దరిదాపుల్లోకి వచ్చే వాళ్లూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ టాప్ 10 లిస్ట్‌లో ముగ్గురు సాకర్ ప్లేయర్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో 2021 నాటికి ప్రపంచంలో సంపన్నులైన అథ్లెట్ల టాప్ 10 జాబితా, వాళ్ల నికర సంపద విలువ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.,10. లియోనెల్ మెస్సీ- సాకర్ఈ అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ నికర సంపద విలువ 28 కోట్ల డాలర్లు (సుమారు రూ. 2082 కోట్లు). ఐదుసార్లు ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్న మెస్సీ.. సమకాలీన ఫుట్‌బాల్‌లో అత్యున్నత ప్లేయర్స్‌లో ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యే బార్సిలోనా నుంచి పీఎస్‌జీ టీమ్‌కు ట్రాన్స్‌ఫర్ అయిన మెస్సీ.. భారీ మొత్తం అందుకున్నాడు.,9. ఫిల్ మికెల్‌సన్ - గోల్ఫ్ఈ అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ నికర సంపద విలువ 40 కోట్ల డాలర్లు (సుమారు రూ. 3 వేల కోట్లు). 1990ల్లో మరో టాప్ గోల్ఫర్ టైగర్‌వుడ్స్ చిరకాల ప్రత్యర్థిగా పేరుగాంచాడు ఫిల్ మికెల్‌సన్. తన కెరీర్‌లో మొత్తం 43 టైటిల్స్ గెలిచాడు. అందులో 5 మేజర్ ఛాంపియన్‌షిప్స్ కూడా ఉన్నాయి.,8. లెబ్రాన్ జేమ్స్ - బాస్కెట్బాల్బాస్కెట్బాల్ ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా లెబ్రాన్ జేమ్స్‌కు పేరుంది. ఈ అథ్లెట్ నికర సంపద విలువ 44 కోట్ల డాలర్లు (సుమారు రూ. 3300 కోట్లు). టీనేజీలో ఉన్న సమయంలోనే నైకీతో డీల్ కుదుర్చుకున్న జేమ్స్.. ఆ తర్వాత కోక్ డీల్‌తోనూ బాగానే వెనకేసుకున్నాడు. 2018లో లాస్‌ఏంజిల్స్ లేకర్స్ టీమ్‌తో నాలుగేళ్లకుగాను 15.3 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.,7. డేవిడ్ బెక్‌హామ్ - సాకర్ఈ ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ నికర సంపద విలువ 45 కోట్ల డాలర్లు (సుమారు రూ. 3350 కోట్లు). ఐదేళ్ల కిందటే ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పినా.. ఇప్పటికీ ఎంతో మంది ప్రిమియర్ లీగ్ స్టార్ల కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఫుట్‌బాల్‌లోనే కాదు బయట కూడా ఫ్యాషన్, ఫుడ్, డ్రింక్, టీవీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాల్లోనూ తన వ్యాపారాలను విస్తరించాడు.,6. క్రిస్టియానో రొనాల్డో- సాకర్సమకాలీన మేటి ఫుట్‌బాల్ ప్లేయర్స్‌లో ఒకడు క్రిస్టియానో రొనాల్డో. ఇతని నికర సంపద విలువ కూడా 45 కోట్ల డాలర్లే. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ రికార్డును సొంతం చేసుకున్న రొనాల్డో.. సంపాదనలో టాప్‌లోనే ఉన్నాడు.,5. ఫ్లాయిడ్ మేవెదర్ - బాక్సింగ్ఆల్టైమ్ బాక్సింగ్ గ్రేట్స్‌లో ఒకడైన ఫ్లాయిడ్ మేవెదర్ నికర సంపద విలువ 56.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 4,200 కోట్లు). 2015లో మ్యానీ పకియావోతో ఫైట్ తర్వాత మేవెదర్ సంపద అమాంతం పెరిగింది. ఇక 2017లో యూఎఫ్‌సీ స్టార్ కానర్ మెక్‌గ్రెగర్‌తో ఫైట్ కూడా మేవెదర్‌పై కాసుల వర్షం కురిపించింది. ఈ బౌట్‌లో విజయంతో మేవెదర్ 50-0 అరుదైన రికార్డును అందుకున్నాడు.,4. మ్యాజిక్ జాన్సన్ - బాస్కెట్బాల్ఈ మాజీ బాస్కెట్‌బాల్ ప్లేయర్ నికర సంపద విలువ 60 కోట్ల డాలర్లు (సుమారు రూ. 4,500 కోట్లు). 1996లో ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ నుంచి రిటైరైన తర్వాత కూడా మ్యాజిక్ జాన్సన్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ప్రారంభించిన బిజినెస్‌లోనూ సక్సెసయ్యాడు. 2012లో లాస్ ఏంజిల్స్ డాడ్జర్స్ టీమ్ కోఓనర్‌గా మారాడు.,3. రోజర్ ఫెదరర్ - టెన్నిస్టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడైన రోజర్ ఫెదరర్ నికర సంపద విలువ 70 కోట్ల డాలర్లు (సుమారు రూ. 5,200 కోట్లు). 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 103 ఏటీపీ కెరీర్ టైటిల్స్ ఫెదరర్ ఖాతాలో ఉన్నాయి. కెరీర్‌లో సాధించిన విజయాల ద్వారా 13 కోట్ల డాలర్లు వెనకేసుకున్నా.. ఎండార్స్‌మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించాడు.,2. టైగర్‌వుడ్స్ - గోల్ఫ్గోల్ఫ్ ప్రపంచం చూసిన అత్యుత్తమ ప్లేయర్ టైగర్‌వుడ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో తొలి స్పోర్ట్స్ బిలియనీర్‌గా అతనికి పేరుంది. ప్రస్తుతం అతని నికర సంపద విలువ 80 కోట్ల డాలర్లు (సుమారు రూ. 6 వేల కోట్లు). 1996లో ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారిన తర్వాత మొత్తం 140 కోట్ల డాలర్ల సంపదను పోగేసుకున్నాడు. అయితే ఈమధ్య అతని రాసలీలలు బయటపడటంతో భార్యకు విడాకుల తర్వాత భారీగా భరణం సమర్పించుకోవాల్సి వచ్చింది.,1. మైకేల్ జోర్డాన్ - బాస్కెట్బాల్ఫోర్బ్స్ ప్రకారం ఆల్‌టైమ్ బెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ మైకేల్ జోర్డాన్ నికర సంపద విలువ 190 కోట్ల డాలర్లు (సుమారు రూ. 14,130 కోట్లు). కెరీర్‌లో జీతాల రూపంలో 9 కోట్ల డాలర్లే సంపాదించినా.. కోర్టు బయట స్పాన్సర్‌షిప్ డీల్స్‌తో బిలియనీర్‌గా మారాడు. నైకీ, గాటరాడ్‌లాంటి డీల్స్ జోర్డాన్‌పై కోట్ల వర్షం కురిపించాయి., ,