Ipl Matches in Theaters: థియేటర్లలో ఐపీఎల్ మ్యాచ్‌ల స్క్రీనింగ్ - కోలీవుడ్ ఎగ్జిబిటర్ల నిర్ణయం
Ipl Matches in Theaters: ఐపీఎల్ మ్యాచ్‌లను థియేటర్లలో స్క్రీనింగ్ చేసేలా అనుమతులు ఇవ్వాలని కోలీవుడ్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Ipl Matches in Theaters: ఐపీఎల్ మ్యాచ్‌లను సినిమాల మాదిరిగా థియేటర్లలో వీక్షిస్తూ ఎంజాయ్ చేసే అవకాశం క్రికెట్ ఫ్యాన్స్‌కు దక్కేలా కనిపిస్తోంది. ఈ దిశగా తమిళనాడు సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం థియేటర్ల మనుగడ కష్టతరం కావడంతో వాటికి బతికించే దిశగా కొన్ని డిమాండ్స్‌ను తమిళనాడు సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు ఉంచింది.
సినిమాల మాదిరిగానే ఐపీఎల్ మ్యాచ్‌లను నేరుగా థియేటర్లలో స్క్రీనింగ్ చేసే అనుమతిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతే కాకుండా అందాల పోటీలతో పాటు ఇతర కమర్షియల్ ఈవెంట్స్‌ను థియేటర్లలో ప్రదర్శించే వెసులుబాటును కల్పించమని కోరింది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే కొత్త సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఓటీటీలో కొత్త సినిమాల తాలూకు ప్రకటనల్ని నాలుగు వారాల తర్వాతే ప్రదర్శించాలని తమ డిమాండ్స్ లేఖలో పేర్కొన్నది. ఓటీటీల ద్వారా నిర్మాతలకు వచ్చే రెవెన్యూలో ఒక శాతాన్ని థియేటర్లకు కేటాయించాలని తెలిపింది.
అంతే కాకుండా ఏ గ్రేడ్ స్టార్స్ తప్పకుండా ప్రతి ఏడాది రెండు సినిమాల్లో నటించాలని, అప్పడే థియేటర్ల ఆదాయం పెరగడమే కాకుండా సినీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని కోలీవుడ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నది.
మంగళవారం తమ డిమాండ్స్‌ను ప్రభుత్వానికి ఎగ్జిబిటర్లు విన్నవించారు. ఎగ్జిబిటర్ల డిమాండ్స్‌పై స్టాలిన్ ప్రభుత్వం ఎలా స్పందించనున్నదనేది మరో రెండు, మూడు రోజుల్లో తేలనుంది.
టాపిక్