NTR with Indian Cricketers: తారక్‌తో భారత ఆటగాళ్లు.. ట్విటర్‌లో ఫొటో వైరల్-team india players meets with ntr in hyderabad photo goes to viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Team India Players Meets With Ntr In Hyderabad Photo Goes To Viral

NTR with Indian Cricketers: తారక్‌తో భారత ఆటగాళ్లు.. ట్విటర్‌లో ఫొటో వైరల్

Maragani Govardhan HT Telugu
Jan 17, 2023 09:59 AM IST

NTR with Indian Cricketers: టీమిండియా ఆటగాళ్లు.. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌ను కలిశారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న తరుణంలో హైదరాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు ఎన్‌టీఆర్‌ను కలిశారు.

ఎన్‌టీఆర్‌తో టీమిండియా ఆటగాళ్లు
ఎన్‌టీఆర్‌తో టీమిండియా ఆటగాళ్లు

NTR with Indian Cricketers: శ్రీలంకతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సమరానికి సమయాత్తమైంది. బుధవారం నాడు హైదరాబాద్ వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే భారత్.. భాగ్యనగరానికి చేరుకుంది. ఆదివారం లంకతో మూడో వన్డే ముగిసిన అనంతరం డైరెక్టుగా హైదరాబాద్‌కు బయల్దేరింది. తాజాగా టీమిండియా ఆటగాళ్లు కొంతమంది హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇందులో భాగంగా యంగ్ టైగర్ ఎన్‌టీఆర్‌తో కలిశారు.

ట్రెండింగ్ వార్తలు

భారత యువ ఆటగాళ్లు హైదరాబాద్‌లో జూనియర్ ఎన్‌టీఆర్‌ను కలిశారు. కాసేపు తారక్‌తో ముచ్చటించారు. అంతేకాకుండా ఈ హీరోతో కలిసి ఫొటో కూడా దిగారు. వీరిలో సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, యజువేంద్ర చాహల్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ ఫొటోపై విశేషంగా స్పందిస్తున్నారు.

జూనియర్ ఎన్‌టీఆర్ ఇటీవలే లాంగ్ వెకేషన్‌కు వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన తారక్.. కుటుంబంతో కలిసి అక్కడ సందడి చేశారు. ఇటీవలే తిరుగొచ్చిన ఆయన.. తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్‌టీఆర్ 30 సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు.

న్యూజిలాండ్ భారత్‌లో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఇక్కడకు రానుంది. ఆ జట్టుతో 4 టెస్టుల సిరీస్ ఆడనుంది రోహిత్ సేన.

WhatsApp channel

సంబంధిత కథనం