Team India on Jadeja: జడేజా రాసుకున్నది ఆయింట్‌మెంటే: రిఫరీకి చెప్పిన ఇండియన్ టీమ్-team india on jadeja says he was just applying ointment ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India On Jadeja: జడేజా రాసుకున్నది ఆయింట్‌మెంటే: రిఫరీకి చెప్పిన ఇండియన్ టీమ్

Team India on Jadeja: జడేజా రాసుకున్నది ఆయింట్‌మెంటే: రిఫరీకి చెప్పిన ఇండియన్ టీమ్

Hari Prasad S HT Telugu
Feb 10, 2023 09:44 AM IST

Team India on Jadeja: జడేజా చేతికి రాసుకున్నది ఆయింట్‌మెంటే అంటూ రిఫరీకి చెప్పింది టీమిండియా మేనేజ్‌మెంట్. నాగ్‌పూర్ టెస్ట్ తొలి రోజు ఆటలో సిరాజ్ నుంచి ఏదో తీసుకొని జడ్డూ తన వేలికి రాసుకుంటున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

సిరాజ్ చేతి నుంచి ఏదో తీసుకుంటున్న జడేాజా
సిరాజ్ చేతి నుంచి ఏదో తీసుకుంటున్న జడేాజా

Team India on Jadeja: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలి రోజే ఓ వివాదం ఊపేసింది. మ్యాచ్ ప్రారంభం కానంత వరకూ పిచ్ పై నడిచిన వివాదం.. తర్వాత దానిపైకి మళ్లింది. ఇలాంటి అవకాశం కోసమే చూసే ఆస్ట్రేలియా మీడియా దీనిని పెద్ద చేస్తోంది. తొలి రోజు ఆటలో సిరాజ్ చేతి నుంచి జడేజా ఏదో తీసుకొని తన వేలికి రాసుకోవడం కనిపించింది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్ వెంటనే రంగంలోకి దిగి ఈ విషయం మరీ ముదరకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. మేనేజ్‌మెంటే తనకు తానుగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి జడేజా తన వేలికి రాసుకున్నది ఓ ఆయింట్‌మెంట్ అని చెప్పింది. ఇది కేవలం నొప్పిని నివారించడానికే అని వివరణ ఇచ్చింది.

నిజానికి ఈ ఘటనపై ఆస్ట్రేలియా టీమ్ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయితే పరిస్థితులను బట్టి ఇలాంటి ఘటనలపై రిఫరీ ఎవరి ఫిర్యాదు లేకపోయినా స్వతంత్రంగా విచారణ జరిపే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు బాల్ షేప్ మారకుండా ఉంచడానికి నిబంధనల ప్రకారం.. ఎవరైన తమ చేతులకు ఏదైనా రాసుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా అంపైర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదంతా వివాదాన్ని పెద్దది చేసే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన టీమ్ మేనేజ్‌మెంట్ రిఫరీని కలిసి జరిగిన విషయాన్ని చెప్పింది. సుమారు ఐదు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన జడేజా 5 వికెట్లతో ఆస్ట్రేలియాను దెబ్బ తీశాడు. లంచ్ తర్వాత వరుసగా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా 120 పరుగులకు 5 వికెట్లో ఉన్న సమయంలో జడేజా ఇలా తన చేతిలో ఏదో రాసుకోవడం కనిపించింది.

జడ్డూ దెబ్బకు ఆస్ట్రేలియాకు 177 రన్స్ కే ఆలౌటైంది. అశ్విన్ కూడా మూడు వికెట్లు తీసుకున్నాడు. మొదట్లోనే సిరాజ్, షమి దెబ్బ కొట్టడంతో ఆస్ట్రేలియా షాక్ కు గురైంది. ఆ తర్వాత పనిని స్పిన్నర్లు పూర్తి చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం