Team India Meet Sobers: విండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్‌తో విరాట్, రోహిత్.. వీడియో వైరల్
Team India Meet Sobers: విండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్‌తో విరాట్, రోహిత్ ఉన్న వీడియో వైరల్ అవుతోంది. క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడైన సోబర్స్.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియం దగ్గరికి వచ్చాడు.
Team India Meet Sobers: వెస్టిండీస్ టూర్ లో ఉన్న ఇండియన్ క్రికెట్ టీమ్ లెజెండరీ క్రికెటర్ గ్యారీ సోబర్స్ ను కలిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలతోపాటు శుభ్‌మన్ గిల్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లాంటి క్రికెటర్లు అతన్ని కలిసి మాట్లాడారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ప్లేయర్స్ అందరినీ దగ్గరుండి పరిచయం చేయించాడు.
గిల్ ను పరిచయం చేస్తూ.. మా టీమ్ లో ఉన్న యంగ్, ఎక్సైటింగ్ ప్లేయర్ ఇతడు అని చెప్పడం విశేషం. సోబర్స్, అతని భార్య స్టేడియానికి వచ్చారు. తనను కలిసి టీమిండియా క్రికెటర్లందరికీ సోబర్స్ తన భార్యను ప్రత్యేకంగా పరిచయం చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది. నిజానికి సోబర్స్ ను కలిసి విరాట్ కోహ్లి.. 2020లో అదే గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిటన ఉన్న మేల్ క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు గెలుచుకున్నాడు.
రోహిత్, విరాట్ లతో సోబర్స్ కాసేపు ముచ్చటించాడు. ఆ పక్కనే సోబర్స్ పేరిట ఉన్న పెవిలియన్ ను కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు. రోహిత్, విరాట్ ల తర్వాత కోచ్ ద్రవిడ్.. గిల్, శార్దూల్ ఠాకూర్ లను సోబర్స్ కు పరిచయం చేయించాడు. క్రికెటర్లు సోబర్స్ తో కలిసి ఫొటోలు కూడా దిగారు.
వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 టీమ్ ను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్, వన్డేల్లో నంబర్ టూ ర్యాంకుల్లో ఉంది. తొలి టెస్ట్ జులై 12న ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే.
ఇండియా టెస్ట్ టీమ్ ఇదే: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ