Suresh Raina Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా.. ట్విటర్ వేదికగా స్పష్టం -team india cricketer suresh raina announce retirement all formats of cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Team India Cricketer Suresh Raina Announce Retirement All Formats Of Cricket

Suresh Raina Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా.. ట్విటర్ వేదికగా స్పష్టం

Maragani Govardhan HT Telugu
Sep 06, 2022 01:10 PM IST

Suresh Raina Retirement: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లో వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. తాజాగా మిగిలిన ఫార్మాట్లకు కూడా గుడ్ బై చెప్పాడు.

సురేశ్ రైనా
సురేశ్ రైనా

Suresh Raina Retired All Formats of cricket: టీమిండియా ప్లేయర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రైనా.. తాజాగా దేశవాళీ, ఐపీఎల్, ఇతర ఫస్ట్ క్లాస్ క్రికెట్ గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్ వేదికగా తెలియజేశాడు. మంగళవారం నాడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు

నా దేశం, రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఈ సందర్భంగా బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ క్రికెట్ బోర్డుకు, చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, రాజీవ్ శుక్లాతో పాటు నా వెన్నెంటే ఉండి ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. అని సురేశ్ రైనా ట్వీట్ చేశాడు.

"ఇంకో రెండు, మూడేళ్ల పాటు ఆడతానని ఇంతకుముందు ప్రకటించిన సురేశ్ రైనా.. తాజా నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. నేను ఇంకో రెండు, మూడేళ్లు పాటు ఆడదామనుకున్నా. కానీ కొంతమంది యువకులు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు. నేను ఇప్పటికే యూపీ క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాను. నా నిర్ణయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు కూడా తెలియజేశాను." అని సురేశ్ రైనా స్పష్టం చేశాడు.

సురేశ్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. తన సహచర బ్యాటర్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన గంటలోపే అతడు కూడా వీడ్కొలు పలకడం గమనార్హం. ధోనీతో పాటు రైనా కూడా 2011 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాలో సభ్యుడుగా ఉన్నాడు.

సురేశ్ రైనా తన అంతర్జాతీయ కెరీర్‌లో 226 వన్డేలు, 18 టెస్టులు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 5615 పరుగులు చేయగా.. టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. టెస్టుల్లో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా సురేశ్ రైనా రికార్డు సృష్టించాడు. ఈ శతకాలు కూడా విదేశాల్లో కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ విషయానికొస్తే 12 ఏళ్ల కెరీర్‌లో 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు. ఇందులో చెన్నై తరఫునే 4687 పరుగులు ఉండటం విశేషం. మొత్తంగా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం