Murder for Virat and Rohit: ఉన్మాదంగా మారిన అభిమానం.. విరాట్-రోహిత్‌లను తిట్టినందుకు స్నేహితుడినే నరికి చంపిన వ్యక్తి
Murder for Virat and Rohit: తమిళనాడులోని అరియలూరు జిల్లాలో దారణం చోటు చేసుకుంది. తన అభిమాన క్రికెటర్లయిన విరాట్-రోహిత్‌ను తిట్టినందుకు తన స్నేహితుడినే అతి కిరాతకంగా నరికి చెంపాడు ఓ ప్రబుద్ధుడు.
Murder for Virat and Rohit: హీరోల మధ్య ఫ్యాన్ వార్‌లు జరగడం తరచూ చూస్తూనే ఉంటాం. ఒకరినొకరు తిట్టుకోవడం మహా అయితే కాస్త గొడవ పెద్దదై కొట్టుకోవడం వరకు జరుగుతుంది. అంతేకానీ చంపుకునేంత వరకు వెళ్లడం చాలా అరుదు. అభిమాన క్రికెటర్ల విషయంలోనూ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుంటాయి.. కానీ అవి మరీ చంపుకునేంత వరకు వెళ్లవు. తాజాగా తమిళనాడులో ఓ సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన అభిమాన క్రికెటర్లను తిట్టాడని సొంత స్నేహితుడినే చంపేశాడు ఓ ఘనడు. ఈ దారణం తమిళనాడులోని అరియలూరు జిల్లాలో జరిగింది.
తమిళ మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను దూషించాడనే కారణంతో స్నేహితుడిని కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఓ వ్యక్తి. చనిపోయిన వ్యక్తి పేరు విఘ్నేశ్ కాగా.. చంపిన వ్యక్తి పేరు ధర్మరాజ్. పోలీసుల వివరాల ప్రకారం.. అరియలూరు జిల్లా పోయూరు గ్రామానికి చెందిన ధర్మరాజు, ప్రభాకరన్, విఘ్నేశ్ ముగ్గురు కలిసి బుధవారం ఉదయం మద్యం సేవించారు. అనంతరం విఘ్నేశ్ ఇంటికి వచ్చి విశ్రమించాడు. అయితే సాయంత్రం ధర్మరాజు, ప్రభాకరన్ విఘ్నేశ్ ఇంటికి వెళ్లి మద్యం తాగడానికి పిలిచారు. స్నేహితుల కోరిక మేరకు విఘ్నేశ్ వారితో వెళ్లాడు.
గ్రామానికి పక్కన ఉన్న అడవీ ప్రాంతంలో వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అయితే ధర్మారాజు కొడవలితో విఘ్నేశ్ చంపి పరారయ్యాడు. పోలీసుల విచారణ చేపట్టగా.. తమ మధ్య క్రికెట్ గురించి సంభాషణ జరిగిందని, క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని విఘ్నేశ్ బూతులు తిట్టడంతో సహించలేకపోయానని ధర్మరాజు చెప్పాడు. దీంతో అతడిని కొడవలితో నరికి చంపేశానని ధర్మరాజు పోలీసులకు వివరించాడు.
పోలీసులు ధర్మరాజుపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు. కేవలం తన అభిమాన క్రికెటర్లను తిట్టాడనే విఘ్నేశ్‌ను చంపాడా? లేక వేరే కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ధర్మరాజు నిజం దాచిపెడుతున్నాడని వారు అనుమానిస్తున్నారు.
ప్రస్తుత ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఈ దారణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చంపుకునేంత రాక్షస అభిమానమేంటని ప్రశ్నిస్తున్నారు. అభిమానం మంచిదే కానీ, మద్యమే ఇలాంటి అనర్ధాలకు దారితీస్తుందని తెలియజేస్తున్నారు.
సంబంధిత కథనం