T20 World Cup Afghanistan Team: కెప్టెన్‌గా నబీ.. టీ20 వరల్డ్‌కప్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ ఇదే-t20 world cup team of afghanistan announced on thursday september 15th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  T20 World Cup Team Of Afghanistan Announced On Thursday September 15th

T20 World Cup Afghanistan Team: కెప్టెన్‌గా నబీ.. టీ20 వరల్డ్‌కప్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 15, 2022 02:49 PM IST

T20 World Cup Afghanistan Team: టీ20 వరల్డ్‌కప్‌కు ఆఫ్ఘనిస్థాన్‌ టీమ్‌ను ప్రకటించింది అక్కడి క్రికెట్‌ బోర్డు. ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘన్ టీమ్‌ను మహ్మద్‌ నబీ లీడ్‌ చేయనున్నాడు.

ఆఫ్ఘనిస్థాన్ టీమ్
ఆఫ్ఘనిస్థాన్ టీమ్ (AFP)

T20 World Cup Afghanistan Team: ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ కోసం గురువారం (సెప్టెంబర్‌ 15) టీమ్‌ను ప్రకటించింది ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. ఈ టీమ్‌ను మహ్మద్‌ నబీ లీడ్‌ చేయనున్నాడు. 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించారు. అక్టోబర్‌ 16 నుంచి టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభం కానుండగా.. ఈ టోర్నీకి ఆఫ్ఘన్‌ టీమ్‌ నేరుగా క్వాలిఫై అయింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మధ్యే ముగిసిన ఆసియా కప్‌లో ఆడిన 17 మంది ప్లేయర్స్‌ నుంచి సమీవుల్లా షిన్వారీ, హష్మతుల్లా షాహిది, అఫ్సర్‌ జజాయ్‌, కరీం జనత్‌, నూర్‌ అహ్మద్‌లను పక్కన పెట్టారు. డార్విష్‌ రసూలీ, ఖాయిస్‌ అహ్మద్‌, సలీమ్‌ సఫీలు ఈ 15 మంది సభ్యుల టీమ్‌లోకి వచ్చారు. ఇక అఫ్సర్‌ జజాయ్‌, షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, రహమత్‌ షా, గుల్బదీన్‌ నాయిబ్‌లను రిజర్వ్‌ ప్లేయర్స్‌గా ఉంచారు.

22 ఏళ్ల డార్విష్‌ రసూలి.. ఈ ఏడాది మొదట్లోనే ఆఫ్ఘనిస్థాన్ టీమ్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మధ్య వేలి గాయంతో ఆసియా కప్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో అతన్ని తిరిగి వరల్డ్‌కప్‌కు ఎంపిక చేశారు. వరల్డ్‌కప్‌ కంటే ముందు ఆసియా కప్‌ టీమ్‌కు ఎంతగానో ఉపయోగపడిందని చీఫ్‌ సెలక్టర్‌ నూర్‌ మాలిక్‌జాయ్‌ అన్నాడు.

ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ లీగ్‌ స్టేజ్‌లో అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌, శ్రీలంక టీమ్స్‌ను ఓడించి సూపర్ 4 స్టేజ్‌కు క్వాలిఫై అయిన తొలి టీమ్‌గా నిలిచింది. అయితే సూపర్‌ 4లో మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. పాకిస్థాన్‌పై గెలిచినంత పని చేసినా.. చివర్లో పాక్‌ బౌలర్‌ నసీమ్‌ షా వరుసగా రెండు సిక్సర్లు బాది ఆఫ్ఘన్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ ఓటమితో టోర్నీ నుంచి ఔటైపోయిన ఆఫ్ఘన్‌ టీమ్‌.. తర్వాత ఇండియా చేతిలో దారుణంగా ఓడిపోయింది.

టీ20 వరల్డ్‌కప్‌కు ఆఫ్ఘన్ టీమ్‌ ఇదే

మహ్మద్‌ నబీ (కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌ (వైస్‌ కెప్టెన్‌), రెహ్మనుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, డార్విష్‌ రసూలి, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, ఫజల్‌ హక్‌ ఫరూకీ, హజ్మతుల్లా జజాయ్‌, ఇబ్రహీం జద్రాన్‌, ముజీబుర్‌ రెహమాన్‌, నవీనుల్‌ హక్‌, ఖాయిస్‌ అహ్మద్‌, రషీద్‌ఖాన్‌, సలీమ్‌ సఫీ, ఉస్మాన్‌ ఘనీ

WhatsApp channel