T20 Record: ఒకే ఓవర్లో 46 పరుగులు.. ఊహకందని వరల్డ్ రికార్డు-t20 record as a bowler conceded 46 runs in an over ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  T20 Record As A Bowler Conceded 46 Runs In An Over

T20 Record: ఒకే ఓవర్లో 46 పరుగులు.. ఊహకందని వరల్డ్ రికార్డు

ఒకే ఓవర్లో 46 పరుగులు ఇచ్చిన బౌలర్ హర్మన్
ఒకే ఓవర్లో 46 పరుగులు ఇచ్చిన బౌలర్ హర్మన్

T20 Record: ఒకే ఓవర్లో 46 పరుగులు వచ్చాయి. ఈ ఊహకందని వరల్డ్ రికార్డు ఓ టీ20 మ్యాచ్ లో నమోదైంది. కువైట్ లో జరుగుతున్న కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీ 2023లో ఈ రికార్డు రావడం విశేషం.

T20 Record: ఒకే ఓవర్లో 46 పరుగులు వచ్చాయంటే నమ్మగలరా? కానీ ఈ ఊహకందని వరల్డ్ రికార్డు ఓ టీ20 మ్యాచ్ లో నమోదైంది. ఇప్పుడీ రికార్డు గురించే క్రికెట్ ప్రపంచం చర్చించుకుంటోంది. కువైట్ లో జరుగుతున్న కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రికార్డు నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్ ఎన్సీఎం ఇన్వెస్ట్ మెంట్, టాలీ సీసీ మధ్య జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

టాలీ బౌలర్ హర్మాన్ ను ఎన్సీఎం టీమ్ కు చెందిన వాసు ఉతికి ఆరేశాడు. ఈ ఓవర్లో మొత్తం ఆరు సిక్స్ లతోపాటు రెండు నోబాల్స్, రెండు బౌండరీలు వచ్చాయి. ఇప్పటి వరకూ క్రికెట్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు కొట్టి 36 పరుగులు చేస్తేనే సంచలనం. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లతోపాటు మొత్తం 46 పరుగులు రావడం నివ్వెరపరుస్తోంది.

హర్మాన్ ఓవర్ ను నోబాల్ తో స్టార్ట్ చేశాడు. దానిని వాసు సిక్స్ గా మలిచాడు. ఆ తర్వాత 4 బైస్ వచ్చాయి. తర్వాతి ఐదు బంతులకు వరుసగా ఐదు సిక్స్ లు వచ్చాయి. అందులో ఒకటి నోబాల్. ఇక ఓవర్ చివరి బాల్ కు ఫోర్ రన్స్ వచ్చాయి. ఇలా మొత్తం 8 బంతుల్లో 46 పరుగులు రావడం గమనార్హం. క్రికెట్ లో ఇలాంటి రికార్డు నమోదవడం ఇదే తొలిసారి.

ఐపీఎల్లో గతంలో ఒకే ఓవర్లో 37 పరుగులు రెండుసార్లు నమోదయ్యాయి. 2011లో అప్పటి కొచ్చి టస్కర్స్ టీమ్ బౌలర్ పరమేశ్వరన్ 37 పరుగులు ఇవ్వగా.. తర్వాత 2021లో ఆర్సీబీకి చెందిన హర్షల్ పటేల్ కూడా సీఎస్కేతో మ్యాచ్ లో ఒకే ఓవర్లో 37 రన్స్ సమర్పించుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ విషయానికి వస్తే వన్డేల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు ఇద్దరి పేరటి ఉంది. సౌతాఫ్రి బ్యాటర్ హర్షలీ గిబ్స్, అమెరికాకు చెందిన జాస్కరన్ మల్హోత్రా ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాదారు. టీ20ల్లోనూనూ ఒకసారి యువరాజ్ సింగ్, మరోసారి కీరన్ పొలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాదారు. టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్లో 35 పరుగులు ఇచ్చాడు బుమ్రా.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్