Suryakumar About Promotion: నమ్మలేకపోతున్నా.. కలలా ఉంది.. ప్రమోషన్‌పై సూర్యకుమార్ ఆనందం -suryakumar yadav reacts after getting promoted as vice captain for sri lanka t20i series ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Suryakumar Yadav Reacts After Getting Promoted As Vice Captain For Sri Lanka T20i Series

Suryakumar About Promotion: నమ్మలేకపోతున్నా.. కలలా ఉంది.. ప్రమోషన్‌పై సూర్యకుమార్ ఆనందం

Maragani Govardhan HT Telugu
Dec 29, 2022 01:16 PM IST

Suryakumar About Promotion: సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై అతడు స్పందించాడు. తను ఈ ప్రమోషన్‌పై ఆనందం వ్యక్తం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (ANI)

Suryakumar About Promotion: టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. పొట్టి ఫార్మాట్‌లో అగ్రస్థానంలో నిలిచిన ఈ స్టార్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబై పోయాడు. ఇదంతా కలలా ఉందని పేర్కొన్నాడు. అయితే అతడు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన విషయాన్ని మొదటు అతడు తండ్రి నుంచి తెలిసిందట. ఆయన పంపిన మెసేజ్ ద్వారా సూర్య తెలుసుకున్నట్లు తెలిపాడు. ఆ మెసేజ్‌ను తాను నమ్మలేకపోయానని అన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ప్రస్తుతం ముంబయి తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడుతున్న అతడు వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ కావడంపై స్పందించాడు. "సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మా నాన్న నుంచి ఈ విషయం తెలుసుకున్నాను. ఆయన జట్టు లిస్టుతోపాటు ఓ మెసేజ్ కూడా పంపారు. 'నువ్వు ఏ మాత్రం ఒత్తిడికి లోను కావద్దు. నీ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయ్' అని పేర్కొన్నారు. ఈ విషయం నమ్మలేకపోయాను. ఒక్క క్షణం కళ్లు మూసుకుని కలగంటున్నానా? అని ప్రశ్నించుకున్నాను. ఎంతో అద్భుతమైన ఫీలింగ్ అది. ఒత్తిడిని స్వీకరిస్తాను. ఎప్పుడూ నా ఆటను ఆస్వాదిస్తాను. అంతకుమించి ఎక్కువగా ఆలోచించను" అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

తాను ఎప్పుడూ బ్యాటింగ్‌కు వచ్చినా తన ఎలాంటి భారాన్ని మైదానం వరకు తీసుకురానని, హోటెల్, నెట్స్‌లోనే వదిలేసి వస్తానని స్పష్టం చేశాడు. గేమ్‌లో తన ఆటను మాత్రమే ఆస్వాదిస్తానని స్పష్టం చేశాడు. బాధ్యతాయుతంగా ఉండటానికి కొంచెం ఒత్తిడి అవసరమేనని అన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం 31 మ్యాచ్‌లు ఆడిన అతడు రెండు సెంచరీలు, 9 అర్ధ శతకాలు చేశాడు. అంతేకాకుండా 187 స్ట్రైక్ రేటుతో 1164 పరుగులు చేశాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జనవరి 3 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య ఎంపికకాగా.. వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.

సంబంధిత కథనం

టాపిక్