Suryakumar Yadav on World No.1 Rank: ఇప్పటికీ కలగానే ఉంది: వరల్డ్‌ నంబర్‌ 1 ర్యాంక్‌పై సూర్యకుమార్‌-suryakumar yadav on world number one rank says its still feels like a dream ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Suryakumar Yadav On World Number One Rank Says Its Still Feels Like A Dream

Suryakumar Yadav on World No.1 Rank: ఇప్పటికీ కలగానే ఉంది: వరల్డ్‌ నంబర్‌ 1 ర్యాంక్‌పై సూర్యకుమార్‌

Hari Prasad S HT Telugu
Dec 26, 2022 02:34 PM IST

Suryakumar Yadav on World No.1 Rank: ఇప్పటికీ కలగానే ఉందని అంటున్నాడు వరల్డ్‌ నంబర్‌ 1 ర్యాంక్‌పై సూర్యకుమార్‌ యాదవ్‌. పీటీఐకి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో అతడు వివిధ అంశాలపై మాట్లాడాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (PTI)

Suryakumar Yadav on World No.1 Rank: ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు తిరుగులేదు అనడంలో సందేహం లేదు. టీమ్‌లోకి అడుగుపెట్టిన ఏడాదిలోనే అత్యంత నిలకడగా ఆడుతున్న ప్లేయర్‌గా ఎదిగాడు. 2022లో అయితే ఈ ఫార్మాట్‌లో ఏకంగా 31 మ్యాచ్‌లలోనే 1164 రన్స్‌ చేశాడు. సగటు 46.56 కాగా.. స్ట్రైక్‌ రేట్‌ 187 కావడం విశేషం. రెండు సెంచరీలు కూడా బాదాడు.

ట్రెండింగ్ వార్తలు

దీంతో టీ20ల్లో సూర్యకుమార్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ అందుకున్నాడు. దీనిపై తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య స్పందించాడు. ఇప్పటికీ ఇలా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించడం కలగానే ఉందని, ఏడాది కిందట ఇదే విషయం తనతో ఎవరైనా చెబితే ఎలా స్పందించే వాడినో అని అన్నాడు. టీ20లు ఆడటం మొదలుపెట్టినప్పుడు అత్యుత్తమంగా ఆడాలని అనుకున్నానని, అందుకోసం తీవ్రంగా శ్రమించానని చెప్పాడు.

"ఇప్పటికీ ఇది కలగానే ఉంది. వరల్డ్‌ నంబర్ వన్‌ బ్యాటర్‌గా నన్ను చూడటం థ్రిల్లింగ్‌గా ఉంది. ఏడాది కిందట ఎవరైనా ఇదే విషయం నాతో చెప్పి ఉంటే నేను ఎలా రియాక్ట్‌ అయ్యేవాడినో. ఈ ఫార్మాట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు అత్యుత్తమంగా ఆడాలని అనుకున్నాను. దానికోసం శ్రమించాను" అని సూర్యకుమార్‌ చెప్పాడు.

ఇక ఇప్పుడు వన్డే వరల్డ్‌ కప్‌ ఏడాదిలోకి క్రికెట్‌ టీమ్స్‌ అడుగుపెట్టాయి. మరి వన్డే ఫార్మాట్‌లో వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకొని తన బ్యాటింగ్‌లో ఎలాంటి మార్పులు చేసుకుంటావని ప్రశ్నించగా.. తానెప్పుడూ టీమ్‌లో ఓ గేమ్‌ ఛేంజర్‌గా ఉండాలని అనుకుంటానని, అన్ని ఫార్మాట్లలోనూ బ్యాటింగ్‌ ఇష్టపడతానని తెలిపాడు.

"ఏ ఫార్మాట్‌లో ఆడినా మరీ ఎక్కువగా ఆలోచించకూడదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ ఆట నాకు ఇష్టం. ఎప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లినా బాగా ఆడాలని అనుకుంటాను. నేనెప్పుడు ఆడటానికి వెళ్లినా గేమ్‌ ఛేంజర్‌గా ఉండాలనే కలలు కనేవాడిని. టీ20లైనా, వన్డేలైనా, రంజీ ట్రోఫీ అయినా బ్యాటింగ్‌ను బాగా ఇష్టపడేవాడిని. నా టీమ్‌ నేను 40-50 బాల్స్‌లో ఓ పని చేయాలని చెప్పినప్పుడు నేను 100 బాల్స్‌ ఎందుకు బ్యాటింగ్‌ చేస్తాను" అని సూర్య అన్నాడు.

WhatsApp channel