Suryakumar Yadav: కొందరు ప్లేయర్స్‌కే ఎక్కువ అవకాశాలు.. సూర్యనే ఉదాహరణ: మండిపడిన మాజీ క్రికెటర్-suryakumar yadav is great example of how some players get more protections says laxman shivaramakrishnan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Suryakumar Yadav Is Great Example Of How Some Players Get More Protections Says Laxman Shivaramakrishnan

Suryakumar Yadav: కొందరు ప్లేయర్స్‌కే ఎక్కువ అవకాశాలు.. సూర్యనే ఉదాహరణ: మండిపడిన మాజీ క్రికెటర్

Hari Prasad S HT Telugu
Mar 24, 2023 10:04 AM IST

Suryakumar Yadav: కొందరు ప్లేయర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు.. అందుకే సూర్యనే ఉదాహరణ అంటూ మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ మండిపడ్డాడు.

సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (PTI)

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది టీ20ల్లో రెడ్ హాట్ ఫామ్ లో ఉన్న అతన్ని వన్డేలు, టెస్టులకు కూడా ఎంపిక చేశారు. అయితే దీనినే మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ తీవ్రంగా తప్పుబడుతున్నాడు. కొందరు ప్లేయర్స్ కే జట్టులో రక్షణ ఉంటుందనడానికి సూర్యకుమారే పెద్ద ఉదాహరణ అని అతడు అనడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

టీ20ల్లో టాప్ ఫామ్ లోనే ఉన్నా.. వన్డేలకు వచ్చేసరికి సూర్య ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాడు. అతడు ఇప్పటి వరకూ24 వన్డేల్లో కేవలం 433 రన్స్ మాత్రమే చేశాడు. సగటు కూడా 24 మాత్రమే. అయినా టీ20 ప్రదర్శన చూసి ఇప్పటికీ సూర్యను వన్డే టీమ్ లో కొనసాగిస్తుండటంపై లక్ష్మణ్ శివరామకృష్ణణ్ మండిపడ్డాడు. గురువారం (మార్చి 23) రెండు ట్వీట్లలో టీమ్ మేనేజ్‌మెంట్ తీరును ఎండగట్టాడు.

"కొందరు ప్లేయర్స్ కే రక్షణ దొరుకుతుందని చెప్పడానికి ఉదాహరణ ఇదే.సూర్యకుమారే గొప్ప ఉదాహరణ. టీ20 క్రికెట్, 50 ఓవర్ల క్రికెట్ పూర్తిగా వేరు. రెడ్ బాల్ క్రికెట్, వైట్ బాల్ క్రికెట్ అని మాత్రమే వేరు చేసి చూడొద్దు.సూర్యకుమార్ టెస్టు టీమ్ లోనూ సభ్యుడే. టీ20 ప్రదర్శన చూసి ఓ ప్లేయర్ ను అన్ని ఫార్మాట్లకు ఎంపిక చేయడం సరికాదు" అని అతడు స్పష్టం చేశాడు.

"వినూత్నమైన షాట్లు ఆడటానికి గొప్ప సామర్థ్యం అవసరం. కానీ ప్రతిసారీ అలాగే ఆడతానంటే మాత్రం కాస్త సుదీర్ఘమైన ఫార్మాట్లలో సులువుగా ఔటవుతారు. అది 50 ఓవర్లు అయినా, టెస్ట్ క్రికెట్ అయినా" అని లక్ష్మణ్ శివరామకృష్ణణ్ అన్నాడు.

2019 వరల్డ్ కప్ లో సరైన నాలుగో నంబర్ బ్యాటర్ లేకపోవడం వల్లే టీమిండియా ఇబ్బంది పడింది. ఇప్పుడు వరల్డ్ కప్ ఏడాదిలో అదే నాలుగోస్థానం మరోసారి సమస్యగా మారింది. ఆ స్థానంలో సూర్యకుమార్ సెట్ కావడం లేదు. శ్రేయస్ అయ్యర్ గాయం ఈ సమస్యను మరింత జటిలం చేసింది. నాలుగో నంబర్ లో సరైన బ్యాటర్ ను కనిపెట్టడం టీమ్ మేనేజ్‌మెంట్ కు సవాలుగా మారింది.

WhatsApp channel

సంబంధిత కథనం