Suryakumar Yadav eyes world record: రిజ్వాన్‌ వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్‌-suryakumar yadav eyes world record against new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Suryakumar Yadav Eyes World Record Against New Zealand

Suryakumar Yadav eyes world record: రిజ్వాన్‌ వరల్డ్ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్‌

Hari Prasad S HT Telugu
Nov 18, 2022 07:54 AM IST

Suryakumar Yadav eyes world record: రిజ్వాన్‌ వరల్డ్ రికార్డుపై కన్నేశాడు మన సూర్యకుమార్‌ యాదవ్‌. న్యూజిలాండ్‌తో శుక్రవారం (నవంబర్‌ 18) నుంచి ప్రారంభం కాబోతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఈ రికార్డు బ్రేక్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సూర్యకుమార్, మహ్మద్ రిజ్వాన్
సూర్యకుమార్, మహ్మద్ రిజ్వాన్ (AP)

Suryakumar Yadav eyes world record: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఓడినా.. సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం తనదైన రీతిలో చెలరేగాడు. అతని మెరుపులు ఆస్ట్రేలియాలోని పెద్ద గ్రౌండ్లను కూడా చిన్నవిగా మార్చేశాయి. టోర్నీలో 239 రన్స్‌తో మూడో అత్యధిక రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోతున్న మూడు టీ20ల సిరీస్‌లో మరో వరల్డ్‌ రికార్డుపై అతడు కన్నేశాడు.

ట్రెండింగ్ వార్తలు

నిజానికి ఈ రికార్డు సాధించడం అంత సులువు కాకపోయినా.. అది మాత్రం ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ వరల్డ్‌ రికార్డు పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌, ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ పేరిట ఉంది. ఒక ఏడాదిలో టీ20ల్లో అత్యధిక రన్స్‌ చేసిన ప్రపంచ రికార్డు అది. 2021లో రిజ్వాన్‌ 1326 రన్స్‌ చేసి ఈ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఈ రికార్డుకు సూర్యకుమార్‌ 286 రన్స్‌ దూరంలో ఉన్నాడు.

అయితే అతని ముందు ఉన్నవి మాత్రం కేవలం మూడు టీ20లే. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరగబోయే ఈ మూడు టీ20లే చివరివి. దీంతో సూర్య ఈ రికార్డును అధిగమిస్తాడా లేదా అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సూర్యకుమార్‌ 2022లో ఇప్పటి వరకూ 29 టీ20ల్లో 1040 రన్స్‌ చేశాడు. 2021లోనే తన తొలి వరల్డ్‌కప్‌ ఆడిన సూర్య.. ఏడాది వ్యవధిలోనే టీ20ల్లో నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగాడు.

ప్రస్తుతం అదే ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో టాప్‌ 3 రోహిత్‌, రాహుల్‌, విరాట్ కోహ్లి లేకపోవడంతో బ్యాటింగ్‌ భారం మొత్తం సూర్యపైనే పడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ప్రతి మ్యాచ్‌లో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే జరిగితే సూర్యకు ఆ వరల్డ్‌ రికార్డు కూడా సొంతమవుతుంది.

2022లో సూర్యకుమార్‌ ఏకంగా 9 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక ఈ సీజన్‌లో టీ20ల్లో 43.33 సగటుతో రన్స్‌ చేశాడు. ఒక కేలండర్‌ ఏడాది వెయ్యి టీ20 ఇంటర్నేషనల్‌ రన్స్‌ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ఈ మధ్యే ముగిసిన వరల్డ్‌కప్‌లోనే ఆ రికార్డును అతడు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ ఇండియా తరఫున మొత్తంగా 40 టీ20లు ఆడిన సూర్య 1284 రన్స్‌ చేశాడు.

WhatsApp channel