Surya Kumar Breaks Maxwell Record: టీ20ల్లో సూర్య‌కుమార్ కొత్త రికార్డ్ -suryakumar becomes fastest player to reach 1000 runs in t20 cricket ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Suryakumar Becomes Fastest Player To Reach 1000 Runs In T20 Cricket

Surya Kumar Breaks Maxwell Record: టీ20ల్లో సూర్య‌కుమార్ కొత్త రికార్డ్

Nelki Naresh Kumar HT Telugu
Oct 03, 2022 09:29 AM IST

Surya Kumar Breaks Maxwell Record: సౌతాఫ్రికాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో రాణించాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌. 22 బాల్స్‌లోనే 61 ర‌న్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో రెండు అరుదైన రికార్డుల‌ను నెల‌కొల్పాడు. ఆ రికార్డ్స్ ఏవంటే...

సూర్య‌కుమార్ యాద‌వ్‌
సూర్య‌కుమార్ యాద‌వ్‌ (Twitter)

Surya Kumar Breaks Maxwell Record: ఆదివారం సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు టీమ్ ఇండియా యువ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్‌. అత‌డి మెరుపుల‌తో టీమ్ ఇండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో 237 ప‌రుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో 18 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌. మొత్తంగా 22 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 61 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ఈ మ్యాచ్‌తో సూర్య‌కుమార్ ప‌లు రికార్డుల‌ను సృష్టించాడు. టీమ్ ఇండియా త‌ర‌ఫున అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల‌లో వెయ్యి ప‌రుగుల మార్కును అందుకున్న మూడో క్రికెట‌ర్‌గా నిలిచాడు.

31 ఇన్నింగ్స్‌ల‌లోనే సూర్య‌కుమార్ వెయ్యి ప‌రుగులు పూర్తి చేశాడు. అత‌డికంటే ముందు ఈ ఘ‌న‌త‌ను విరాట్ కోహ్లి (Virat kohli), కె.ఎల్ రాహుల్ (Kl rahul) సాధించారు. వారి త‌ర్వాత సూర్య‌కుమార్ నిలిచాడు. అంతేకాకుండా టీ20 ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌లో అతి త‌క్కువ బాల్స్‌లో వెయ్యి ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా కొత్త రికార్డును క్రియేట్ చేశాడు సూర్య‌కుమార్ యాద‌వ్‌. కేవ‌లం 573 బాల్స్‌లోనే సూర్య‌కుమార్ యాద‌వ్ 1000 ప‌రుగుల్ని పూర్తిచేశాడు.

గ‌తంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేరిట ఈ రికార్డ్ ఉంది. మ్యాక్స్‌వెల్ 604 బాల్స్‌లో వెయ్యి ప‌రుగులు చేశాడు. ఆదివారం నాటి మ్యాచ్‌తో మ్యాక్‌వెల్ రికార్డును సూర్య‌కుమార్ యాద‌వ్ తిర‌గ‌రాశాడు. ఈ జాబితాలో కొలిన్ మున్నో నాలుగో ప్లేస్‌లో, ఎవిన్ లూయిస్ ఐదో ప్లేస్‌లో ఉన్నారు.

WhatsApp channel