Raina on Dhawan: పంజాబ్ విజయంలో ధావన్‌దే కీలక పాత్ర.. సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు-suresh raina credits punjab kings skipper shikhar dhawan for win rajasthan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Suresh Raina Credits Punjab Kings Skipper Shikhar Dhawan For Win Rajasthan

Raina on Dhawan: పంజాబ్ విజయంలో ధావన్‌దే కీలక పాత్ర.. సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Apr 07, 2023 08:02 PM IST

Raina on Dhawan: రాజస్థాన్‌పై పంజాబ్ విజయంలో కీలక పాత్ర ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్‌దేనని టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పష్టం చేశాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు.

శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ (AFP)

Raina on Dhawan: పంజాబ్ కింగ్స్ ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో అదరగొడుతోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలను సొంతం చేసుకుని తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగుల అర్ధశతకంతో అదరగొట్టడంతో పంజాబ్ 197 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 192 పరుగులే చేయగలిగింది. దీంతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ధావన్‌పై పొగడ్తలతో ముంచెత్తాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా.

ట్రెండింగ్ వార్తలు

"ధావన్ ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్ట్రైక్ రేటుతో మెరుగైన ప్రదర్శన మ్యాచ్‌ను గెలిపించాడు. రెండు ఐపీఎల్‌లో కలిపి వరుసగా 7 ఐపీఎల్‌ల్లో అతడు 450 పరుగులను సాధించాడు. మంచు ఉన్నప్పుడు వేగం మరింత తేలికగా ఉంటుందని అతడికి తెలుసు. చాలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. అందుకే పంజాబ్ అద్బుత ప్రదర్శనతో విజయం సాధించింది. అందులో ధావన్ ముఖ్య పాత్ర పోషించాడు." అని రైనా అన్నాడు.

నాథన్ ఎల్లిస్‌పై బౌలింగ్‌లో అదరగొట్టాడని రైనా అన్నాడు. "ఈ మ్యాచ్ విజయంలో ఎల్లీస్ పాత్ర చాలా ఉంది. అతడు తీసిన వికెట్లు చూస్తే.. ఇద్దరు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. అందులో ముఖ్యుడు జాస్ బట్లర్. అతడు కానీ క్రీజులో ఉన్నట్లయితే గేమ్‌ను చాలా ముందే ముగించేవాడు. అనంతరం సంజూ శాంసన్ వికెట్ తీశాడు. బౌండరీలు లేకుండా భాగస్వామ్యం నెలకొల్పడం మరో విషయం కాబట్టి సంజూ భిన్నమైన షాట్‌కు ప్రయత్నించాడు. దీంతో ఔటయ్యాడు." అని స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన రాజస్థాన్ 192 పరుగులే చేయగలిగింది. సంజూ శాంసన్(42), షిమ్రన్ హిట్మైర్(36), ధ్రువ్ జురెల్(32) ధాటిగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. రాజస్థాన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లీస్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

WhatsApp channel