Gavaskar about Bhuvneshwar: 'భువి ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది.. పేలవ బౌలింగ్‌తో వరుసగా విఫలం'.. గవాస్కర్ వ్యాఖ్యలు
Sunil Gavaskar about Bhuvneshwar: డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ఆందోళన రేకెత్తిస్తుందని టీమీండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భువి లాంటి అనుభవజ్ఞుడి నుంచి ఇలాంటి ప్రదర్శన కోరుకోవట్లేదని తెలిపాడు.
Sunil Gavaskar concern About Bhuvneshwar Kumar bowling: మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించి సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది ఆసీస్. అయితే ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా బౌలర్ల వరుసగా విఫలం కావడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. భువనేశ్వర్ కుమార్ గత కొన్ని మ్యాచ్‌ల నుంచి వరుసగా విఫలం కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. భువి డెత్ ఓవర్లలో విఫలమవుతున్నాడని, ధారాళంగా పరుగులు సమర్పిస్తున్నాడని తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
"ఈ మ్యాచ్‌లో మనవాళ్లు సరిగ్గా బౌలింగ్ చేయలేదు. ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ప్రతిసారి విఫలమవుతున్నాడు. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఇలా గత మూడు మ్యాచ్‌ల్లో 3 డెత్ ఓవర్లలో 49 పరుగులు సమర్పించాడు. అంటే ఒక్కో బంతికి మూడు పరుగులు ఇచ్చాడు. భువి లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల నుంచి ఇలాంటి ప్రదర్శన కోరుకోం. అతడు మహా అయితే 35-36 పరుగులు కంటే ఎక్కువగా ఇవ్వకూడదు. ఇది నిజంగా టీమిండియాను కలవరపరిచే విషయం." అని గవాస్కర్ స్పష్టం చేశాడు.
గాయం కారణంగా గత మ్యాచ్‌లో పునరాగమనం చేసిన హర్షల్ పటేల్‌ను సునీల్ గవాస్కర్ వెనకేసుకొచ్చారు. "హర్షల్ చాలా మంచి బౌలర్. అతడు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి వచ్చాడనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే ప్రపంచకప్‌నకు ఆడే బౌలర్లకు ముందు నుంచే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశమివ్వాలి. వారి లయను తిరిగి పొందడానికి రెండు, మూడు వన్డేలు ఆడించాల్సి ఉంది. ఈ విషయంపై భారత మేనేజ్మెంట్ దృష్టి సారంచాల్సి ఉంది." అని సునీల్ గవాస్కర్ తెలిపారు.
ఆస్ట్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫలితంగా ఆసీస్.. మూడు టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది. మొదట్లో కామెరాన్ గ్రీన్ (30 బాల్స్‌లో 61), చివర్లో మాథ్యూ వేడ్(21) 45) మెరుపులు మెరిపించి ఆస్ట్రేలియాకు కళ్లు చెదిరే విజయాన్ని అందించారు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో కేవలం 17 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసినా.. మిగతా బౌలర్లు విఫలమవడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు.
స్టార్ బౌలర్లు భువనేశ్వర్, చహల్, హర్షల్ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(55), హార్దిక్ పాండ్య(71) అర్ధశతకాలతో చెలరేగగా సూర్యకుమార్ యాదవ్(71) మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌తో బ్యాట్ ఝుళిపించాడు. ఫలితంగా భారత్ 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సంబంధిత కథనం