Steve Smith: రెండేళ్ల తర్వాత స్టీవ్ స్మిత్ సెంచరీ - న్యూజిలాండ్ తో వన్డే సిరీస్
Steve Smith: స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది. ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ కు ఇదే చివరి వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.
Steve Smith: స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 25 రన్స్ తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం ఇంటర్ నేషనల్ క్రికెట్ లో స్టీవ్ స్మిత్ సెంచరీ చేయడం గమనార్హం. 131 బాల్స్ లో ఓ సిక్సర్ పదకొండు ఫోర్లతో స్టీవ్ స్మిత్ 105 రన్స్ చేశాడు. స్టీవ్ స్మిత్ తో పాటు లబూషేన్ 52 రన్స్, అలెక్స్ క్యారీ 42 రన్స్ తో రాణించడంతో ఆస్ట్రేలియా యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 267 రన్స్ చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2, సాథీ, ఫెర్గ్యూసన్, సాంటర్న్ తలో ఒక్క వికెట్ తీశారు. 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గ్లెన్ ఫిలిప్స్ 47, నీషమ్ 36, అలెన్ 35 పరుగులతో రాణించిన భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు, గ్రీన్, అబాట్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ మ్యాచ్ లో38వ ఓవర్ లో క్రికెట్ ఆట పట్ల తనకున్న నాలెడ్జ్ నుచాటుకొని అభిమానుల్ని అలరించాడు స్టీవ్ స్మిత్. నీషమ్ వేసిన బాల్ ను స్క్వేర్ లెగ్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ఆ బంతిని నో బాల్ గా ప్రకటించమని అంపైర్ ను కోరాడు. 30 యార్డ్ సర్కిల్ బయట న్యూజిలాండ్ పరిమితికి మించి ఫీల్డర్లను ఉంచిందని ఫీల్డ్ అంపైర్ కు స్మిత్ సూచించాడు. అతడి సూచనను గమనించిన అంపైర్ నోబాల్ గా ప్రకటించాడు.
ఈ మ్యాచ్ తో మూడు వన్డేల సిరీస్ ను 3 - 0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. కాగా వన్డేల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ కు ఇదే చివరి మ్యాచ్. ఇటీవలే ఆయన రిటైర్ మెంట్ ప్రకటించాడు. చివరి మ్యాచ్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.