Ind vs SL 2nd ODI: భారత బౌలర్ల ధాటికి లంక కుదేలు.. స్వల్ప స్కోరుకే ఆలౌట్
Ind vs SL 2nd ODI: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించారు. వీరి ధాటికి లంక జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్, సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు.
Ind vs SL 2nd ODI: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక జట్టు 210 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో నువనిడు ఫెర్నాండో(50) అర్ధశతకం మినహా.. మిగిలిన వార్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఫలితంగా ఓ మాదిరి స్కోరు రావడం కూడా ఆ జట్టుకు కష్టతరంగా మారింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లతో రాణించగా.. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంకకు శుభారంభమేమి దక్కలేదు. ఆరో ఓవర్లోనే ఓపెనర్ అవిష్కా ఫెర్నాండోను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం కుశాల్ మెండీస్ సాయంతో మరో ఓపెనర్ నువనీడు ఫెర్నాండో శ్రీలంక ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. నిలకడగా ఆడుతూ ఆకట్టుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. కుశాల్ మెండీస్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు.
ఇంక అప్పటి నుంచి శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దనంజయ డిసిల్వా, ఫెర్నాండో, దసున్ శనకా. చరిత్ అసలంక, వానిందు హసరంగా స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. అయితే చివర్లో కసున్ రజిత, దునిత్ ఇద్దరూ కాసేపు వికెట్ల పతనాన్ని ఆపారు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అయితే 40వ ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో దునిత్, లహిరు కుమారాను ఔట్ చేయడంతో లంక జట్టు ఆలౌటైంది. 39.4 ఓవర్లోల శ్రీలంక 215 పరుగులకు శ్రీలంక కుప్పకూలింది.