Union Budget 2025: కేంద్ర బడ్జెట్‍లో క్రీడలకు భారీగా పెరిగిన కేటాయింపులు.. ఖేలో ఇండియాకు పెద్దపీట.. లెక్కలు ఇవే-sports burget raised and khelo india gets big allocation in union budget 2025 presented by nirmala sitharaman ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Union Budget 2025: కేంద్ర బడ్జెట్‍లో క్రీడలకు భారీగా పెరిగిన కేటాయింపులు.. ఖేలో ఇండియాకు పెద్దపీట.. లెక్కలు ఇవే

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‍లో క్రీడలకు భారీగా పెరిగిన కేటాయింపులు.. ఖేలో ఇండియాకు పెద్దపీట.. లెక్కలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 01, 2025 06:07 PM IST

Union Budget 2025-26 for Sports: కేంద్ర బడ్జెట్‍లో యువజన, క్రీడల శాఖకు కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్‍తో పోలిస్తే వీటికి కేటాయింపు అధికమైంది. ఖేలో ఇండియాకు పెద్దపీట వేసింది కేంద్రం.

Union Budget 2025: కేంద్ర బడ్జెట్‍లో క్రీడలకు భారీగా పెరిగిన కేటాయింపులు.. ఖేలో ఇండియాకు పెద్దపీట.. లెక్కలు ఇవే
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‍లో క్రీడలకు భారీగా పెరిగిన కేటాయింపులు.. ఖేలో ఇండియాకు పెద్దపీట.. లెక్కలు ఇవే (AP)

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‍ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. నేడు (ఫిబ్రవరి 1) లోక్‍సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి యువజన, క్రీడల శాఖకు రూ.3,794.30 కోట్లను బడ్జెట్‍లో కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. గతేడాది కంటే ఇది ఎక్కువ. క్షేత్రస్థాయిలో క్రీడాకారులను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చేందుకు తలపెట్టిన ఖేలో ఇండియాకు పెద్దపీట వేసింది.

ఎంత పెరిగిదంటే..

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను గతేడాది బడ్జెట్‍లో యువజన, క్రీడాశాఖకు కేంద్ర ఆర్థిక శాఖ రూ.3,442.32 కోట్ల కేటాయించింది. అయితే, ఈసారి 2025-26లో రూ.3,794.30 కోట్లను కేంద్రం ఆ శాఖకు కేటాయింపులు చేసింది. అంటే సుమారు రూ.351.98 కోట్ల భారీ మొత్తాన్ని ఆ శాఖకు కేంద్ర పెంచింది.

ఖేలో ఇండియాకు ప్రాధాన్యత

యువజన, క్రీడల శాఖకు కేటాయించిన మొత్తంలో ఖేలో ఇండియాకు పెద్దపీట వేసింది కేంద్రం. ఈ ప్రతిష్టాత్మక పతకానికి రూ.1,000కోట్లను కేటాయించింది. 2024-25 బడ్జెట్‍లో ఖేలో ఇండియాకు రూ.800కోట్లు ఇవ్వగా.. ఇప్పుడు 2025-26 బడ్జెట్‍లో రూ.200 కోట్లను అధికంగా కేటాయించింది. ఒక్క ఖేలో ఇండియాకే రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్టు తెలిపింది. క్షేత్రస్థాయిలో ఉండే యువక్రీడాకులకు సానపెట్టే ఖేలో ఇండియా పథకానికి కేంద్ర మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈ కేంద్ర బడ్జెట్‍లో స్పష్టమైంది.

జాతీయ క్రీడల సమాఖ్యకు రూ.340 కోట్ల నుంచి రూ.400కోట్లకు కేటాయింపులను కేంద్రం అధికం చేసింది. అథ్లెట్ల ట్రైనింగ్, నేషనల్ క్యాంప్స్, రవాణా ఏర్పాట్లు చేసే స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియాకు కేటాయింపును రూ.830 కోట్లకు పెంచింది. గత బడ్జెట్ కంటే ఇది రూ.15కోట్లు అధికం.

నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి రూ.23కోట్లను కేటాయింపులు దక్కాయి. గత బడ్జెట్‍లో ఈ మొత్తం రూ.18.70గా ఉండగా.. ఈసారి పెరిగింది.

జమ్ముకశ్మీర్‌లో క్రీడా సౌకర్యాలను పెంచేందుకు రూ.20కోట్లను కేంద్రం కేటాయించింది. గత ఏడాది ఇది రూ.14 కోట్లుగా ఉండగా.. ఈసారి అధికం చేసింది. యువతను సామాజిక కార్యక్రమాలు, ప్రజాసేవలో భాగం చేసేందుకు అమలు చేస్తున్న నేషనల్ సర్వీస్ స్కీమ్‍(ఎన్ఎస్ఎస్)కు రూ.450 కోట్లను కేంద్రం కేటాయించింది. 2024-25 బడ్జెట్‍లో ఇది రూ.250కోట్లుగా ఉండగా.. ఇప్పుడు 2025-26లో ఏకంగా రూ.200కోట్లను పెంచేసింది.

2036 ఒలింపిక్ క్రీడలను దేశంలో నిర్వహించాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం పోటీలో ఉంటామని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కూడా ఇప్పటికే లేఖ సమర్పించింది.

Whats_app_banner

సంబంధిత కథనం