Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్.. ఆ ఇద్దరినీ కాదని..!-sourav ganguly biopic as ranbir kapoor to play lead role says a report ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sourav Ganguly Biopic As Ranbir Kapoor To Play Lead Role Says A Report

Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్.. ఆ ఇద్దరినీ కాదని..!

Hari Prasad S HT Telugu
Feb 22, 2023 10:13 PM IST

Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్ లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు ఈ బయోపిక్ కోసం త్వరలోనే కోల్‌కతాకు కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి

త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న గంగూలీ బయోపిక్
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న గంగూలీ బయోపిక్ (PTI)

Sourav Ganguly Biopic: ఇండియన్ క్రికెట్ టీమ్ ను సౌరవ్ గంగూలీకి ముందు, తర్వాత అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా టీమిండియాపై అతడు తన ముద్ర వేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం నుంచి టీమ్ ను బయటపడేయడమే కాదు.. విదేశాల్లో పిరికి జట్టుగా వచ్చిన పేరును చెరిపేయడంలో దాదా తన వంతు పాత్ర పోషించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడు అలాంటి క్రికెటర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కబోతోందంటే అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి గంగూలీయే స్వయంగా స్క్రిప్ట్ అందించాడని గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు ఈ మూవీలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటించనున్నాడని సమాచారం.

ఈ-టైమ్స్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా కోసం హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలాంటి వాళ్ల పేర్లు కూడా వినిపించినా.. చివరికి రణ్‌బీరే ఖరారయ్యాడట. అంతేకాదు అతడు త్వరలోనే కోల్‌కతాకు కూడా వెళ్లి అక్కడ ఈడెన్ గార్డెన్స్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, గంగూలీ ఇంటిని సందర్శించనున్నాడు. ఆ తర్వాతే ఈ మూవీ షూటింగ్ లో రణ్‌బీర్ పాలుపంచుకోనున్నాడు.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. నిజానికి 2019లోనే గంగూలీ బయోపిక్ ను అనౌన్స్ చేశారు. గంగూలీ బయోపిక్ పై అతని భార్య డోనా గంగూలీ స్పందించింది. ఈ మూవీపై ప్రొడ్యూసర్లు, డైరెక్టరే స్పందించాలని అభిప్రాయపడింది. మరి గంగూలీ పాత్రలో ఎవరిని చూడాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకూ ఆమె స్పందించింది.

"నా ఫేవరెట్స్ గురించి తెలుసుకోవాలంటే అమితాబ్ బచ్చన్ లేదంటే షారుక్ ఖాన్ అంటాను. కానీ వయసు రీత్యా వాళ్లు ఈ సినిమాకు సరిపడరు. 24 ఏళ్ల గంగూలీలా కూడా కనిపించాలి. సినిమా చాలా వరకూ ఈ వయసులో ఉన్న గంగూలీ చుట్టే తిరుగుతుంది. అందువల్ల ఆ వయసుకు తగిన నటుడిని ఎంపిక చేయడం మంచిది" అని డోనా అభిప్రాయపడింది.

WhatsApp channel

సంబంధిత కథనం