Smriti Mandhana Career Best Rank: టీ20ల్లో స్మృతి మంధానాకు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌-smriti mandhana reached to career best rank in latest icc t20i rankings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Smriti Mandhana Reached To Career Best Rank In Latest Icc T20i Rankings

Smriti Mandhana Career Best Rank: టీ20ల్లో స్మృతి మంధానాకు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

Hari Prasad S HT Telugu
Sep 20, 2022 05:29 PM IST

Smriti Mandhana Career Best Rank: టీ20ల్లో స్మృతి మంధానా కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గొప్పగా రాణించిన ఆమె.. తాజాగా మంగళవారం (సెప్టెంబర్‌ 20) రిలీజ్‌ చేసిన ర్యాంకుల్లో కెరీర్‌ బెస్ట్‌ అందుకుంది.

కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న స్మృతి మంధానా
కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్న స్మృతి మంధానా (PTI/File Photo)

Smriti Mandhana Career Best Rank: ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానా టీ20 ఇంటర్నేషనల్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. మంగళవారం (సెప్టెంబర్ 20) ఐసీసీ వుమెన్స్‌ ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌ రిలీజ్‌ చేయగా.. అందులో స్మృతి కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో స్మృతి 111 రన్స్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో ఇండియా 1-2తో ఓడిపోయినా.. స్మృతి మాత్రం రాణించింది. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో రెండు ర్యాంక్‌లు మెరుగుపరచుకొని రెండోస్థానానికి చేరింది. ఇక అటు వన్డేల్లోనూ ఆమె ఏడో ర్యాంక్‌కు చేరుకుంది. టీ20 ఫామ్‌ను కొనసాగించిన ఆమె.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 91 రన్స్‌ చేసి టీమ్‌కు 7 వికెట్ల విజయాన్ని అందించింది.

ఇక తాజా ర్యాంకుల్లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ కూడా తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. వన్డే ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ 9వ స్థానానికి చేరుకోగా.. దీప్తి ఒక ర్యాంక్‌ మెరుగుపరచుకొని 32వ స్థానంలో నిలిచింది. ఇక యాస్తికా భాటియా కూడా 8 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరింది. అటు బౌలర్ల లిస్ట్‌లోనూ దీప్తి ఆరు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌కు చేరింది.

ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌ ఒక ర్యాంక్‌ మెరుగుపరచుకొని 14వ స్థానానికి, బౌలర్‌ రేణుకా సింగ్‌ మూడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌కు, స్పిన్నర్‌ రాధా యాదవ్‌ 4 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓడిపోయిన ఇండియన్‌ టీమ్‌.. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో ఉంది. సీనియర్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామికి ఇదే చివరి సిరీస్‌ అన్న విషయం తెలిసిందే.

WhatsApp channel