India vs New Zealand 1st T20I: కివీస్‌తో టీ20 నేటి నుంచే.. హార్దిక్ నేతృత్వంలో ఢీ.. పృథ్వీకి అవకాశమొచ్చేనా?-shubman gill to open ahead of prithvi shaw in 1st t20i against new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shubman Gill To Open Ahead Of Prithvi Shaw In 1st T20i Against New Zealand

India vs New Zealand 1st T20I: కివీస్‌తో టీ20 నేటి నుంచే.. హార్దిక్ నేతృత్వంలో ఢీ.. పృథ్వీకి అవకాశమొచ్చేనా?

Maragani Govardhan HT Telugu
Jan 27, 2023 07:35 AM IST

India vs New Zealand 1st T20I: రాంచీ వేదికగా శుక్రవారం సాయంత్రం 7 గంటలకు న్యూజిలాండ్-భారత్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు లేకుండానే భారత్ తలపడుతోంది. హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

భారత్-న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ (PTI)

India vs New Zealand 1st T20I: న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్ ముగించింది. ఇప్పుడు టీ20 పోరుకు సమయాత్తమైంది. శుక్రవారం నాడు రాంచీ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 జరగబోతుంది. సీనియర్ ఆటగళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే యువ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ టీమ్‌కు హార్దిక్ పాండ్య నేతృత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే పాండ్య కెప్టెన్సీలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌పైనా అంచనాలు నెలకొన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

శుబ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తుండటంతో అతడు తుది జట్టులో ఉంటాడనంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ విషయాన్ని హార్దిక్ పాండ్య కన్ఫార్మ్ చేశాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో గిల్ అదరగొట్టాడు. కాబట్టి టీ20 సిరీస్‌లోనూ రాణిస్తాడని భావిస్తున్నారు. పృథ్వీషాతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. మరి పృథ్వీకైనా అవకాశమిస్తారో లేదో చూడాలి. లేదంటే ఇషాన్ కిషన్‌కు అవకాశమిస్తే గిల్‌ అతడితో పాటు ఓపెనింగ్‌కు వస్తాడు.

విరాట్ కోహ్లీ గైర్హాజరుతో మూడో స్థానంలో రాహుల్ త్రిపాఠి లేదా సూర్యకుమార్ యాదవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ 3వ స్థానంలో వస్తే మిడిలార్డర్డ్‌సో సూర్యకుమార్, హార్దిక్ పాండ్య లాంటి పవర్ హిట్టర్లు ఉన్నారు. లోవర్ ఆర్డర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్‌కు కూడా అందుబాటులో లేకపోవడంతో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరిలో ఒకరికి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో భారత్ బలంగానే కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విభాగానికొస్తే శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్హ్‌దీప్ సింగ్‌ ఉండే అవకాశముంది. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారో జట్టు మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

మరోపక్క న్యూజిలాండ్ జట్టులో రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరుతో మిచెల్ సాంట్నర్ పగ్గాలు తీసుకున్నాడు. ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే లాంటి పవర్ హిట్టర్లు కివీస్ ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయనున్నారు. మార్క్ చాప్‌మన్ 3వ స్థానంలో ఆడతాడు. మిడిలార్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్ వెల్ లాంటి బ్యాటర్లు కివీస్ సొంతం. రాంచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు మిచెల్ సాంట్నర్ తనకు తోడు లెగ్ స్పిన్నర్ ఇష్ సోధీని తీసుకునే అవకాశముంది. బ్లేయిర్ టికెనర్, బెన్ లిస్టర్, లోకి ఫెర్గ్యూసన్‌తో న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది.

జట్లు(అంచనా)..

భారత్..

శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/చాహల్.

న్యూజిలాండ్..

ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, మార్క్ చాప్ మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్ వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), బ్లెయిర్ టికనెర్, ఇష్ సోధీ, బెన్ లిస్టర్, లోకీ ఫెర్గ్యూసన్.

WhatsApp channel

సంబంధిత కథనం