shock to gukesh: ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ కు షాక్.. క్వార్టర్స్ లోనే ఔట్.. చెన్నై కుర్రాడికి ఏమైంది?
shock to gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజ్ గుకేశ్ కు షాక్. ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ ఈ ఏడాది తొలి ఈవెంట్ లో ఈ చెన్నై కుర్రాడు క్వార్టర్స్ లోనే ఓడిపోయాడు. ఫాబియానో కరువానా చేతిలో పరాజయం పాలయ్యాడు.

జర్మనీలోని వీసెన్ హాస్ లో జరుగుతున్న ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ తొలి ఈవెంట్లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ కు షాక్. ఈ చెన్నై ఆటగాడు క్వార్టర్స్ లో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఒక్క విక్టరీ లేకుండానే నిష్క్రమించాడు. గతేడాది చివర్లో చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర నమోదు చేసిన గుకేశ్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించనిదే.
18 ఎత్తుల్లోనే
క్వార్టర్స్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరువానాతో తొలి గేమ్ లో ఓడిపోయిన గుకేశ్ కు రెండో రౌండ్లో డూ ఆర్ డై పరిస్థితి తలెత్తింది. రేసులో నిలవాలంటే కచ్చితంగా విక్టరీ సాధించాల్సి వచ్చింది. కానీ కరువానా దూకుడు ముందు గుకేశ్ తేలిపోయాడు. కేవలం 18 ఎత్తుల్లోనే ఓటమి అంగీకరించాడు. బ్లాక్ పీస్ లతో ఆడిన గుకేశ్ ఏమంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు.
విక్టరీ లేకుండానే
ఈ టోర్నీలో ఒక్క విక్టరీ లేకుండానే గుకేశ్ నిష్క్రమించాడు. అంతకుముందు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్, అలీరెజా ఫిరోజా చేతిలో ఓటమి పాలయ్యాడు. 8వ స్థానంతో లాస్ట్ లో నిలిచి క్వార్టర్స్ కు అర్హత సాధించాడు. కానీ క్వార్టర్స్ లో వరుసగా రెండు రౌండ్లలోనూ ఓడాడు. అంతకుముందు ర్యాపిడ్ సెక్షన్ లో టాప్ లో నిలిచిన కరువానా కు ఆపోనెంట్ ను ఎంచుకునే ఛాన్స్ వచ్చింది. అతను గుకేశ్ ను ఎంచుకున్నాడు. చివరకు విజయం సాధించాడు.
ఆ వివాదం
మరోవైపు ఫిడే, ఫ్రీస్టైల్ చెస్ టూర్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ అనే పదాన్ని ఫ్రీస్టైల్ చెస్ టూర్ వాడొద్దని ఫిడే సూచించింది. దీనికి ఫ్రీస్టైల్ చెస్ టూర్ అంగీకరించింది. కానీ ఆ తర్వాత దీని నుంచి మధ్యలో ఫిడే తప్పుకొంది. ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఫ్రీస్టైల్ చెస్ టూర్ కో ఫౌండర్, టాప్ ప్లేయర్ కార్ల్ సన్.. ఫిడే టోర్నీలో ఆడబోనని ఆనౌన్స్ కూడా చేశాడు.
టాపిక్