Dhawan about Pant Driving: రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురికావడంతో సర్వత్రా అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు పంత్ త్వరగా కోలుకోని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నుదుటిపై, కుడి మోకాలి వద్ద అతడికి గాయాలయ్యాయి. అంతేకాకుండా వీపుపై మంటలు వ్యాపించాయి. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పంత్ కారు డ్రైవింగ్‌పై శిఖర్ ధావన్ మూడేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.,మూడేళ్ల క్రితం ధావన్-పంత్ ఓ చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా రిషబ్.. ధావన్‌తో ఓ సీనియర్‌గా నువ్వు నాకు ఏదైనా సలహా ఇవ్వవా? అని అడుగ్గా.. ఇందుకు గబ్బర్ ముందు బండిని నిదానంగా నడపు అంటూ సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరూ నవ్వుకుంటారు. అప్పుడు ధావన్ జోక్‌గా పంత్‌కు సలహా ఇచ్చినప్పటికీ ఇప్పుడు పంత్‌కు యాక్సిడెంట్ కావడంతో ఆ వీడియో మరోసారి వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.,రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్ నుంచి దిల్లీకి వస్తుండగా కారు ప్రమాదం చోటు చేసుకుంది. రూర్కీ సమీపంలో హమందాపుర్ ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పంత్ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి వేగంగా రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. తృటిలో ప్రాణాల నుంచి తప్పించుకున్ని క్రికెటర్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.,ఉదయం 5.30 గటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని అనంతరం మంటలు వ్యాపించాయని తెలిపారు. అదే మార్గంలో వస్తున్న బస్సు డ్రైవర్ అతడికి సహాయం చేసి సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు.,,