Dhawan Birthday celebrations: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టులో ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మన గబ్బర్ తన పుట్టినరోజును ఢాకాలో జరుపుకున్నాడు. సోమవారం నాడు తన 37 బర్త్ డేను జరుపుకున్నాడు. ఈ వీడియోను ధావన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన సహచరులతో కలిసి తన పుట్టినరోజున ఆనందంగా గడిపాడు. కేక్ కట్ చేయడమే కాకుండా సహచరులతో పంచుకున్నాడు. ఈ వేడుకలో కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కూడా పాల్గొన్నారు.,ప్రస్తుతం ధావన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. బ్యాటింగ్ దిగ్గజం బ్రియన్ లారా, టీమిండియా మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ధావన్‌కు తమ విషేస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.,ప్రస్తుతం ధావన్ బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్నాడు. ఆ జట్టులో భారత్ 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. ధావన్.. భారత వన్డే జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ఆదివారి జరిగిన తొలి వన్డేలో ధావన్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. అతడు కేవలం 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా గబ్బర్ 50 ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. చాలా సందర్భాల్లో వన్డే జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇటీవలే న్యూజిలాండ్ వన్డే జట్టుకు సారథిగా వ్యవహరించాడు గబ్బర్. అయితే ఈ సిరీస్ భారత్ 0-1 తేడాతో ఓడిపోయింది.,వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాడు ధావన్. అతడు వన్డే జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో అతడికి శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ధావన్ ఇంతకు ముందు 2015, 2019 వరల్డ్ కప్‌ల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో అతడు 537 పరుగులు చేశాడు. అంతేకాకుండా 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవడంతో అతడు కీలక పాత్ర పోషించాడు.,Here is the video:,,