Shami Jai Sri Ram chants: షమిని చూసి జై శ్రీరామ్ అని అరిచిన ఫ్యాన్స్.. రోహిత్ రియాక్షన్ ఇదీ-shami jai sri ram chants in ahmedabad test as rohit reacted to the controversy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shami Jai Sri Ram Chants: షమిని చూసి జై శ్రీరామ్ అని అరిచిన ఫ్యాన్స్.. రోహిత్ రియాక్షన్ ఇదీ

Shami Jai Sri Ram chants: షమిని చూసి జై శ్రీరామ్ అని అరిచిన ఫ్యాన్స్.. రోహిత్ రియాక్షన్ ఇదీ

Hari Prasad S HT Telugu
Mar 13, 2023 08:45 PM IST

Shami Jai Sri Ram chants: షమిని చూసి జై శ్రీరామ్ అని అరిచారు కొందరు ఫ్యాన్స్. ఈ ఘటనపై కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత స్పందించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహ్మద్ షమి
మహ్మద్ షమి (AP)

Shami Jai Sri Ram chants: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో ఓ ఊహించని వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమిని చూసిన కొందరు అభిమానులు.. జై శ్రీరామ్ అంటూ అరిచారు. టీమ్ అంతా డగౌట్ లో ఉన్న సమయంలో స్టాండ్స్ లో ఉన్న కొందరు ఫ్యాన్స్ చీర్ చేశారు.

మొదట సూర్యకుమార్ ను చూసి సూర్య సూర్య అంటూ అరిచారు. ఆ తర్వాత చివర్లో షమి వాళ్లకు కనిపించాడు. దీంతో సడెన్ గా జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపించాయి. వీటిని షమి పట్టించుకోకపోవడంతో.. షమీ జై శ్రీరామ్ అంటూ అతని పేరు పిలిచి మరీ అరిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇది క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నారా లేక.. రథయాత్రనా అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ మ్యాచ్ తొలి రోజు అహ్మదాబాద్ స్టేడియంలోని టికెట్లలో 80 శాతం వరకూ బీజేపీ వాళ్లే కొనుగోలు చేశారని, వాళ్లు తీసుకొచ్చిన అభిమానులే ఇలా అరిచారని మరికొందరు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

అసలు ఈ ఘటన జరిగిందన్న విషయం తనకు తెలియనే తెలియదని అతడు అన్నాడు. "షమిని చూసి జై శ్రీరామ్ అని అరిచారన్న విషయం నాకు అస్సలు తెలియదు. ఇప్పుడే తొలిసారి వింటున్నా. అక్కడ ఏం జరిగిందో తెలియదు" అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సందర్భంగా రోహిత్ చెప్పాడు.

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సోమవారం (మార్చి 13)తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను ఇండియా 2-1తో గెలిచింది. 2017 నుంచి ఇండియా ఈ సిరీస్ గెలవడం ఇది వరుసగా నాలుగోసారి.

సంబంధిత కథనం