Olympics Life Lessons: ఒలింపిక్స్ నుంచి నేర్చుకోవాల్సిన ఏడు ముఖ్యమైన జీవిత పాఠాలు!
Life Lessons From The Olympics Telugu: క్రీడలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి. మనుషుల్లో, పిల్లల్లో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంపొందించేలా ప్రేరపిస్తాయని తెలిసిందే. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా జరుగుతున్న వేళ ఒలింపిక్స్ గేమ్స్ నుంచి నేర్చుకోవాల్సిన ఏడు జీవిత పాఠాలు ఏంటో తెలుసుకుందాం.
Life Lessons From The Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రపంచ అంచనాలను అందుకోవడమే కాకుండా ఎప్పటికీ మరచిపోలేని కొన్ని మనసును కదిలించే క్షణాలను అందిస్తున్నాయి. ధైర్యసాహసాలు, అపరిమితమైన నైపుణ్యంతో పాటు అసాధ్యమైన కొన్ని విజయాలు యూత్ నుంచి వృద్ధుల వరకు ఊహించని థ్రిల్‌ను పంచుతున్నాయి.
ఓ రచయిత చెప్పినట్లు క్రీడలకు మానవాళిని ఏకం చేసేందుకు ప్రేరేపించే సామర్థ్యం ఉంది. సమాజంగా మనం ఎంత కలిసి ఆడితే, మన ప్రపంచం హానికరమైన ప్రభావాల బారిన పడటం తగ్గుతుంది. ఈ విషయాన్ని ఒలింపిక్స్ ప్రస్తావించేలా చేసింది. ఒలంపిక్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన, స్ఫూర్తి పొందాల్సిన జీవిత పాఠాలు ఏంటో తెలుసుకుందాం.
- వినయంగా ఉండటం
కొంతమందిని పక్కన పెడితే ఉన్నత శిఖరాలను అధిరోహించిన నిజమైన గొప్ప క్రీడాకారులందరూ సాధారణ మనుషులు. భారత పతక విజేతలు, హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఏస్ షూటర్ మను భాకర్ తమ అత్యున్నత విజయాలను సాధించిన తర్వాత సీనియర్ టీవీ రిపోర్టర్‌ను "సర్" అని సంబోధించారు. గొప్పతనం, వినయం రెండూ కలిసినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి.
2. నిలబడి ఉండటం
డచ్ స్వర్ణ పతక విజేత ఫెమ్కే బోల్ ఆరోగ్య సమస్యలతో పోరాడాల్సి వచ్చింది. కానీ ఆమె మిక్స్డ్ రిలే జట్టును అద్భుతమైన విజయం వైపు నడిపించింది. భారత్‌కు చెందిన వినేశ్ ఫొగాట్ అనేక అడ్డంకులను అధిగమించి పారిస్‌లో పోటీపడే హక్కును సాధించి అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. ఆమెపై అనర్హత వేటు పడినంత మాత్రానా ఆమె తన గొప్పతనం గానీ, దేశంపై ఆమెకున్న స్ఫూర్తిదాయక ప్రభావాన్ని గానీ తగ్గించలేదు. ఏం జరిగినా తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడి ఉండాలని దీని సారాంశం.
3. కసిగా ఉండండి
విజయం సాధించే విషయంలో రాజీ పడకుండా ఉండటం కూడా ఒలింపియన్ ప్రదర్శనల నుంచి మనం నేర్చుకోవచ్చు. పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్ విక్టర్ అక్సెల్ సన్ యువ లక్ష్యసేన్ మెలి మెల్లిగా విజయం వైపుకు సాగాడు. అయితే, తన లక్ష్యంవైపు లక్ష్యసేన్ తగినంత కసిగా లేకపోవడం వల్లే కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో కనీసం రెండుసార్లు వెనక్కి తగ్గాడు. కానీ, తర్వాత చివరకు విజయాన్ని చేజిక్కించుకున్నాడు.
4. ఓపిక పట్టండి
ఇథియోపియా రన్నర్ తామిరత్ తోలా 2016 రియో ఒలింపిక్స్‌లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించాడు. పారిస్ 2024కు రెండు వారాల ముందు, అతను మారథాన్ పరుగు తీస్తాడని అతనికి తెలియదు. కానీ, తన సహచరుడికి గాయం కావడంతో తోలా పాల్గొనడమే కాకుండా రియో ఒలింపిక్స్ తర్వాత ఎనిమిదేళ్లకు బంగారు పతకం సాధించాడు. అది ఒలంపిక్ రికార్డ్‌గా మారింది. కాబట్టి, ఓర్పు, పట్టుదలకు కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుంది.
5. స్మార్ట్‌గా ఉండండి
బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 మందితో కూడిన భారత హాకీ జట్టు తన లక్ష్యాన్ని కాపాడుకున్న తీరు అద్భుతమని చెప్పాలి. అయితే డిఫెండర్ల క్లినికల్ స్మార్ట్‌నెస్ భారత జట్టుకు అద్భుతాలు చేయగా, వారి అద్భుతమైన గోల్ కీపర్ పి. శ్రీజేష్ ఒకదాని తర్వాత మరొకటి అద్భుత ప్రదర్శన చేశాడు. సమయానికి తగినట్లుగా స్మార్ట్‌గా ఉండటం అలవర్చుకోవాలనేది దీని ఉద్దేశ్యం.
6. నిలకడగా ఉండండి
2008 నుంచి 2024 వరకు జరిగిన ఒలింపిక్స్ ప్రతి ఎడిషన్‌లో స్వర్ణ పతకం సాధించిన క్యూబా రెజ్లర్ మిజైన్ లోపెజ్ అద్భుత విజయం పారిస్ క్రీడల నుంచి స్ఫూర్థి పొందాల్సిన, ఎవరు గుర్తించలేని కథ. మనసుకు హత్తుకునే ఈ విజయం తమ కళను, వృత్తిని పక్కన పెట్టే వారందరికీ ఆశను కలిగిస్తుంది. నిలకడగా శ్రమించే తత్వానికి ప్రత్యామ్నాయం లేదని ఈ కథ చెబుతోంది.
7. అంకితభావంతో ఉండండి
ఏ రంగంలోనైనా కేవలం కదలికల ద్వారా ముందుకు సాగేవారికి కీర్తి ఉండదు. ప్యాషనేట్‌గా ఉంటూ తనలో ఉత్తేజాన్ని నింపుకునే వ్యక్తి ఎప్పుడూ ప్రకాశించే వ్యక్తిగా పేరు సంపాదిస్తాడు. ఏ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయినా నిరంతరంగా తనలో ప్యాషన్ లేకపోతే అనుకున్నది సాధించలేడు. ఒకరి అన్వేషణకు అంకితభావం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అంకితభావం కలిగి ఉండటం విజయంలో ఒక భాగం.