Ruturaj Gaikwad Utkarsha Pawar: రుతురాజ్ గైక్వాడ్‌కు కాబోయే భార్య కూడా క్రికెటరే - పెళ్లి వేడుకలు షురూ
Ruturaj Gaikwad Utkarsha Pawar: ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 3న ప్రియురాలు ఉత్కర్ష పవార్ మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు.
Ruturaj Gaikwad Utkarsha Pawar: ఐపీఎల్ 2023లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టి చెన్నై కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. ఈ సీజన్‌లో 635 రన్స్ తో పరుగుల వరద పారించాడు. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ యంగ్ క్రికెటర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 3న ప్రియురాలు ఉత్కర్ష పవార్ మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్ హల్దీ సంబరాల తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆల్‌రౌండర్...
రుతురాజ్ లాగే ఉత్కర్ష పవార్ కూడా ఓ క్రికెటరే. మహారాష్ట్ర తరఫున అనేక దేశవాళీ మ్యాచ్‌లు ఆడింది. ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్నది. పేస్ బౌలింగ్‌లో దిట్ట. అంతే కాకుండా చక్కటి బ్యాటింగ్‌తో ఎన్నో సార్లు రాణించింది.
చదువు కారణంగా కొంతకాలంగా ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం పూణేలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్నట్లు తెలిసింది.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ఉత్కర్ష అటెండ్ అయ్యింది. ధోనీతో రుతురాజ్, ఉత్కర్ష కలిసి దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. కాగా జూన్ నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రుతురాజ్ గైక్వాడ్ ను సెలెక్లర్లు ఎంపికచేశారు. కానీ పెళ్లి కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు. రుతురాజ్ స్థానంలో యశస్వి జైస్వాల్ లండన్ వెళ్లాడు.