Ruturaj Gaikwad 7 sixes: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి-ruturaj gaikwad 7 sixes in an over is a new record in cricket history ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ruturaj Gaikwad 7 Sixes In An Over Is A New Record In Cricket History

Ruturaj Gaikwad 7 sixes: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి

Hari Prasad S HT Telugu
Nov 28, 2022 02:44 PM IST

Ruturaj Gaikwad 7 sixes: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు.. మీరు చదివింది నిజమే. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఈ నమ్మశక్యం కాని రికార్డును నమోదు చేశాడు మహారాష్ట్ర ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.

క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్
క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పిన రుతురాజ్ గైక్వాడ్

Ruturaj Gaikwad 7 sixes: క్రికెట్‌లో రికార్డులు బ్రేక్‌ కావడం సహజమే. అదే సమయంలో గతంలో ఎవరికీ సాధ్యం కాని, నమ్మశక్యం కాని రికార్డులూ నమోదవుతుంటాయి. అలాంటిదే ఇది కూడా. ఒక ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడమే అత్యంత అరుదు. అలాంటిది ఏడు సిక్స్‌లు కొట్టడమంటే మాటలు కాదు. కానీ మహారాష్ట్ర ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఒక ఓవర్లో ఏడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్‌పై రుతురాజ్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ శివ సింగ్ వేసిన ఆ ఓవర్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్‌ 49వ ఓవర్లో రుతురాజ్‌ 7 సిక్స్‌లు కొట్టాడు. ఆ ఓవర్లో ఐదో బంతి నోబాల్‌ కావడంతో ఒక బాల్‌ అదనంగా వచ్చింది.

నోబాల్‌ను సిక్స్‌ కొట్టడంతోపాటు ఆ ఎక్స్‌ట్రా బాల్‌ను కూడా బౌండరీ అవతలకు పంపించడం విశేషం. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 43 రన్స్‌ వచ్చాయి. రుతురాజ్‌ చివరికి 220 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. లిస్ట్‌ ఎ క్రికెట్‌లో ఒకే ఓవర్లో 43 రన్స్‌ వచ్చిన సందర్భం ఇంతకుముందు ఒకేసారి ఉంది. 2018లో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ టీమ్‌కు చెందిన జో కార్టర్‌, బ్రెట్‌ హాంప్టన్‌లు ఈ ఫీట్‌ సాధించారు.

అయితే ఇప్పుడు రుతురాజ్‌ ఒక్కడే 42 రన్స్‌ కొట్టగా, మరొకటి నోబాల్‌ రూపంలో రావడంతో మొత్తం 43 రన్స్‌తో వరల్డ్‌ రికార్డు సమమైంది. 49వ ఓవర్‌ ప్రారంభానికి ముందు రుతురాజ్‌ 147 బాల్స్‌లో 165 రన్స్‌తో ఉన్నాడు. ఓవర్ ముగిసే సరికి అతని డబుల్‌ సెంచరీ పూర్తయిపోవడం విశేషం. 154 బాల్స్‌లోనే 207 రన్స్‌కు చేరుకున్నాడు. దీంతో మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ ముగిసే సమయానికి 5 వికెట్లకు 330 రన్స్‌ చేసింది.

ఒకే బ్యాటర్‌ ఒకే ఓవర్లో 43 రన్స్‌ చేయడం క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక రుతురాజ్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం 16 సిక్స్‌లు ఉన్నాయి. లిస్ట్‌ ఎ క్రికెట్‌లో జస్కరన్ మల్హోత్రా, సౌమ్య సర్కార్‌, ఏబీ డివిలియర్స్, రోహిత్‌ శర్మలు కూడా 16 సిక్స్‌లు కొట్టారు. అత్యధికంగా డీఆర్సీ షార్ట్‌ 23 సిక్స్‌లు బాదాడు. గతంలో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

సోబర్స్‌, రవిశాస్త్రి, గిబ్స్‌, యువరాజ్‌ సింగ్‌, రాస్‌ వైట్లీ, హజ్రతుల్లా జజాయ్‌, లియో కార్టర్‌, కీరన్‌ పొలార్డ్‌, తిసారా పెరీరాలు ఈ ఘనత సాధించిన వాళ్లలో ఉన్నారు. అయితే రుతురాజ్‌ వీళ్లందరినీ వెనక్కి నెట్టి.. ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

WhatsApp channel