Ind vs Aus 2nd ODI: మేము అప్పుడే ఓడిపోయాం.. రెండో వన్డేలో ఓటమిపై రోహిత్ శర్మ స్పందన
Ind vs Aus 2nd ODI: ఆదివారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అనుకున్న విధంగా పరుగులు చేయలేకపోయామని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు.
Ind vs Aus 2nd ODI: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా డు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. బ్యాటింగ్ సహా అన్ని విభాగాల్లో విఫలమైన భారత్.. భారీగా మూల్యం చెల్లించుకుంది. ఆసీస్ బౌలర్ స్టార్క్ ధాటికి 117 పరుగుల స్వల్ప లక్ష్యానికే పరిమితమైన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లోనూ విఫలమైంది. ఈ పరాజయం గురించి మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు.
"ఈ మ్యాచ్‌లో మేము ఘోరంగా విఫలమయ్యాము. స్కోరు బోర్డుపై తగినన్ని పరుగులు ఉంచలేకపోయాము. 117 పరుగుల స్వల్ప స్కోరు చేయడం సరైంది కాదు. వరుసగా వెంట వెంటనే వికెట్లో కోల్పోవడం వల్ల మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాం. తొలి ఓవర్లోనే గిల్ ఔట్ కావడం.. ఆ తర్వాత నేను, విరాట్ కొన్ని పరుగులు చేసినప్పటికీ అవి సరిపోలేదు. త్వరితగతిన వికెట్లు కోల్పోవడం మాకు నష్టం చేసింది. అదే మమ్మల్ని వెనకడుగు వేసేలా చేసింది." అని రోహిత్ శర్మ అన్నాడు.
"ఇవాళ మా రోజు కాదు. ఆసీస్ బౌలర్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కొత్తబంతిని స్వింగ్ చేయడం వల్ల బ్యాటర్లకు ఇబ్బందిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ మెరుగ్గా ఆడాడు. పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశాడు. ప్రపంచంలోని పవర్ హిట్టర్లలో టాప్-3లో ఉంటాడు" అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోరంగా పరాజయం పాలైంది. . 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లే ఛేదించి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(51), మిచెల్ మార్ష్(66) అర్ధశతకాలతో విజృంభించి స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఛేదించారు. ఆసీస్ బౌలర్లు విజృంభించిన పిచ్‌పై భారత బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అంతకు ముందు బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో విజృంభించాడు.