Rohit Sharma: పాక్ జర్నలిస్ట్ కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన రోహిత్
Rohit Sharma: ఆదివారం పాకిస్థాన్ తో మ్యాచ్ నేపథ్యంలో భారత ఓపెనింగ్ జోడిపై పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు.
Rohit Sharma: ఆసియా కప్ నేడు పాకిస్థాన్ తో టీమ్ ఇండియా తలపడబోతున్నది. నేటి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తో కలిసి కె.ఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించబోతున్నాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్ లకు రాహుల్ దూరమవ్వడంతో అతడి స్థానంలో రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను ఓపెనర్లుగా ఆడించి టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ ప్రయోగాలు చేసింది. కె.ఎల్ రాహుల్ కు సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేయడం కోసమే ఈ మార్పులు చేసింది. ఓపెనర్ల మార్పుపై విమర్శలు వచ్చాయి.

తాజాగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించారు. ఇందులో భారత ఓపెనింగ్ జోడిపై పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ అదిరిపోయే సమాధానాన్ని ఇచ్చాడు. ‘గత కొన్ని సిరీస్ లలో ఇండియా ఓపెనర్లను మార్చుతూ వస్తోంది. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ తో పాటు మరికొందరు ఓపెనర్లుగా కనిపించారు. పాక్ తో మ్యాచ్ లో తిరిగి జట్టులో చేరిన రాహుల్ ను ఆడిస్తారా మరో సారి ప్రయోగం చేసే అవకాశం ఉండవచ్చా’ అంటూ పాక్ జర్నలిస్ట్ రోహిత్ శర్మను ప్రశ్నించారు.
టాస్ తర్వాతే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మ్యాచ్ లోనే చూడండి. కొన్ని సీక్రెట్ గానే ఉండటం మంచిది అంటూ అతడి ప్రశ్నకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు రోహిత్. జట్టు కూర్పు కోసమే ఆటగాళ్లను మార్చాల్సివచ్చిందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అందులో కొన్ని సత్పలితాలు ఇస్తే, మరికొన్ని వర్కవుట్ కాలేదని అన్నాడు. ఈ ఆరేడు నెలల్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని అన్నాడు. రోహిత్ శర్మ సమాధానం వైరల్ గా మారింది.