Rohit and Rizwan World Records: ఒకే రోజు టీ20ల్లో రెండు వరల్డ్ రికార్డులు సమం-rohit and rizwan equaled world records in t20s ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit And Rizwan Equaled World Records In T20s

Rohit and Rizwan World Records: ఒకే రోజు టీ20ల్లో రెండు వరల్డ్ రికార్డులు సమం

Hari Prasad S HT Telugu
Sep 20, 2022 09:46 PM IST

Rohit and Rizwan World Records: ఒకే రోజు టీ20ల్లో రెండు వరల్డ్ రికార్డులు సమమయ్యాయి. ఒక రికార్డు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కాగా.. మరో రికార్డు పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో నమోదయ్యాయి.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

Rohit and Rizwan World Records: టీ20ల్లో ఒకే రోజు రెండు వరల్డ్ రికార్డులు సమం కావడం విశేషం. మంగళవారం (సెప్టెంబర్‌ 20) జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా తొలి టీ20లో రోహిత్ శర్మ.. పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో మహ్మద్‌ రిజ్వాన్‌ ఈ రికార్డులను సమం చేశారు. రోహిత్‌ అత్యధిక సిక్స్‌ల రికార్డును, రిజ్వాన్‌ అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన రికార్డును సమం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

రోహిత్‌ 172 సిక్స్‌లు

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అత్యధిక సిక్స్‌ల వరల్డ్‌ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ టీ20ల్లో 172 సిక్స్‌లు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక సిక్స్‌ కొట్టడం ద్వారా న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (172) పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును సమం చేశాడు. ఇదే మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్‌ ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌కు ముందు 171 సిక్స్‌లతో ఉన్న రోహిత్‌.. రెండు సిక్స్‌లు కొట్టి ఉంటే గప్టిల్‌ రికార్డును బ్రేక్‌ చేసేవాడు. కానీ ఆస్ట్రేలియా బౌలర్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాడు. ఈ ఇద్దరి తర్వాత క్రిస్‌ గేల్ 124 సిక్స్‌లో మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 120 సిక్స్‌లతో మూడో స్థానంలో, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ 118 సిక్స్‌లతో ఐదో స్థానంలో ఉన్నారు.

రిజ్వాన్‌.. బాబర్‌ ఆజం వరల్డ్‌ రికార్డు సమం

<p>పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్</p>
పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (AFP)

మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ టీ20ల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగుల రికార్డును అందుకున్నాడు. రిజ్వాన్‌ 52వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. అంతకుముందు బాబర్‌ ఆజం కూడా సరిగ్గా 52వ ఇన్నింగ్స్‌లోనే 2000వ పరుగు చేశాడు. అతడు 2021లో జింబాబ్వేపై ఈ రికార్డు అందుకున్నాడు.

ఇప్పుడు రిజ్వాన్‌ కరాచీలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో ఆ మార్క్‌ అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి 56 ఇన్నింగ్స్‌ రికార్డును రిజ్వాన్‌ బ్రేక్‌ చేశాడు. ఇక టీ20ల్లో బాబర్‌, మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌ తర్వాత 2 వేల రన్స్‌ చేసిన నాలుగో పాకిస్థానీ బ్యాటర్‌గా రిజ్వాన్‌ నిలిచాడు. ఈ ఏడాది ఆసియాకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రిజ్వాన్‌ నిలిచిన విషయం తెలిసిందే.

అదే జోరును ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ రిజ్వాన్‌ కొనసాగించాడు. కేవలం 32 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేసిన అతడు.. 46 బాల్స్‌లో 68 రన్స్‌ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

WhatsApp channel