Rossouw - Pakistan League: పాకిస్థాన్ లీగ్‌లో 43 బాల్స్‌లో రూసో సెంచ‌రీ - టీ20 చ‌రిత్ర‌లో సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్ ఇదే -rilee rossouw hits fastest century in pakistan super league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rilee Rossouw Hits Fastest Century In Pakistan Super League

Rossouw - Pakistan League: పాకిస్థాన్ లీగ్‌లో 43 బాల్స్‌లో రూసో సెంచ‌రీ - టీ20 చ‌రిత్ర‌లో సెకండ్ హ‌య్యెస్ట్ ఛేజింగ్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Mar 11, 2023 08:03 AM IST

Rossouw - Pakistan League: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ప్లేయ‌ర్‌ రూసో కొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. ఈ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన క్రికెట‌ర్‌గా నిలిచాడు.

రూసో
రూసో

Rossouw - Pakistan League: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లో శుక్ర‌వారం పెషావ‌ర్ జాల్మీ, ముల్తాన్ సుల్తాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ప‌లు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావ‌ర్ జాల్మీ 20 ఓవ‌ర్ల‌లో 242 ప‌రుగులు చేసింది. ఆ టార్గెట్‌ను మ‌రోఐదు బంతులు మిగిలుండ‌గానే ముల్తాన్ సుల్తాన్స్‌ ఛేదించి పెషావ‌ర్ టీమ్‌కు షాక్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న సౌతాఫ్రికా ప్లేయ‌ర్ రూసో సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 51 బాల్స్‌లోనే ఎనిమిది సిక్స‌ర్లు, 12 ఫోర్ల‌తో 121 ర‌న్స్ చేశాడు. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా రూసో రికార్డ్ నెల‌కొల్పాడు.

తాను ఎదుర్కొన్న తొలి ఐదు బాల్స్‌లోనే నాలుగు ఫోర్లు ఓ సిక్స‌ర్ కొట్టాడు రూసో. 17 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ మార్కును 43 బాల్స్‌లో సెంచ‌రీ మైలురాయిని అందుకున్నాడు. రూసోతో పాటు పొల్లార్డ్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో భారీ టార్గెట్‌ను ముల్తాన్ సుల్తాన్ ఈజీగా ఛేదించింది.

టీ20 లీగ్ చ‌రిత్ర‌లో ఓ టీమ్ ఛేదించిన హ‌య్యెస్ట్ సెకండ్ టార్గెట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. బాబ‌ర్ ఆజాం (73 ర‌న్స్‌)మెరుపుల‌తో తొలుత బ్యాటింగ్ చేసిన పెషావ‌ర్ జాల్మీ 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 242 ర‌న్స్ చేసింది. భారీ స్కోరు చేసినా ఈ మ్యాచ్‌లో పెషావ‌ర్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

WhatsApp channel