Ponting on Ind vs Aus 4th test: నాలుగో టెస్టులో రాహుల్-శుబ్‌మన్ ఇద్దరినీ ఆడించాలి.. పాంటింగ్ స్పష్టం-ricky ponting urges india to play both kl rahul and shubman gill in ahmedabad test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ricky Ponting Urges India To Play Both Kl Rahul And Shubman Gill In Ahmedabad Test

Ponting on Ind vs Aus 4th test: నాలుగో టెస్టులో రాహుల్-శుబ్‌మన్ ఇద్దరినీ ఆడించాలి.. పాంటింగ్ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Mar 07, 2023 12:57 PM IST

Ponting on Ind vs Aus 4th test: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టులో భారత్ జట్టులో కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ఉండాలని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు.

రాహుల్--గిల్ పై పాంటింగ్ స్పందన
రాహుల్--గిల్ పై పాంటింగ్ స్పందన

Ponting on Ind vs Aus 4th test: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఒకదాంట్లో ఓడింది. సిరీస్ సొంతం చేసుకోవాంటే నాలుగో టెస్టు తప్పకుండా భారత్ గెలవాల్సిందే. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనప్పటికీ అనూహ్యంగా ఆసీస్ పుంజుకుంది. దీంతో గత మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలు నాలుగో టెస్టులో జరగకూడదని టీమిండియా భావిస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ విఫలమైన కేఎల్ రాహుల్‌ను మూడో టెస్టుకు పక్కనబెట్టి శుబ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వగా.. అతడు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించలేదు. దీంతో తదుపరి మ్యాచ్‌లో వీరిద్దరిలో ఎవర్నీ తుది జట్టులో తీసుకోవాలనేది సందిగ్ధంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ ఇద్దరినీ తుది జట్టులో తీసుకోవాలని టీమిండియాకు సూచించాడు. అంతేకాకుడా గిల్‌ను ఓపెనింగ్ ఆడించాలని, రాహుల్‌ను మిడిలార్డర్‌లో దింపాలని స్పష్టం చేశాడు.

"గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి శుబ్‌మన్ గిల్‌ను తీసుకున్నారు. ఇద్దరికీ టెస్టుల్లో అనుభవం ఉంది. కాబట్టి వచ్చే టెస్టులో ఇద్దరినీ జట్టులో తీసుకోవచ్చు. శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా పంపి.. కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలి. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతడికి మిడిలార్డర్‌లో ఆడిన అనుభవం ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. యూకేలో బంతి పగటి పూట స్వింగ్ అవుతుంది. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇక్కడ కూడా బంతి స్వింగ్ అయ్యే అవకాశముంది." అని రికీ పాంటింగ్ అన్నాడు.

యూకే పరిస్థితుల మాదిరిగా చివరి టెస్టులో భారత్-ఆస్ట్రేలియా ఇరు జట్లు తమ బెస్ట్ ప్లెయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలని పాంటింగ్ సూచించాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందుంది. చివరి టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.

WhatsApp channel