Dinesh Karthik | అతడు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ అవుతాడు: దినేశ్ కార్తీక్-rcb player dinesh karthik breached ipl code of conduct ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rcb Player Dinesh Karthik Breached Ipl Code Of Conduct

Dinesh Karthik | అతడు మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ అవుతాడు: దినేశ్ కార్తీక్

Maragani Govardhan HT Telugu
May 27, 2022 03:38 PM IST

టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అవుతాడని కితాబిచ్చాడు.

దినేశ్ కార్తీక్
దినేశ్ కార్తీక్ (PTI)

దినేశ్ కార్తీక్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నిలకడగా రాణిస్తూ.. సెలక్టర్ల చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ముఖ్యంగా మంచి ముగింపునిస్తూ.. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దినేశ్ కార్తీక్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున నిలకడగా రాణిస్తూ.. సెలక్టర్ల చూపు తనవైపు తిప్పుకునేలా చేశాడు. ముఖ్యంగా మంచి ముగింపునిస్తూ.. ఈ సీజన్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పాకిస్థాన్ కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అవ్వగల సమర్థుడని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

"వందశాతం అతడు(బాబర్ అజాం) బ్యాటింగ్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోగల సమర్థుడు. రాబోయే రోజుల్లో టెస్టుల్లోనూ రాణించి మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ స్థాయికి చేరుకోగలడు. అసాధారణంగా ఆడుతున్నాడు. నేను అతడికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అతడికి తన దేశం నుంచి అన్ని రకాల మద్దతు అందుతుంది." అని దినేశ్ కార్తీక్.. బాబర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇదిలా ఉంటే.. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ ఐపీఎల్ నియమావళిని అతిక్రమించాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు మందలించి వదిలేశారు. శుక్రవారం నాడు ఈ మేరకు ఐపీఎల్ ప్రకటన విడుదల చేసింది.

“లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ నియమావళిని అతిక్రమించాడు. అతడు ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.3 ప్రకారం లెవల్-1 నిబంధనను ఉల్లంఘించాడు. అయితే ఈ తప్పును అతడు ఒప్పుకున్నాడు.” అని ఐపీఎల్ ప్రకటించింది.

నియామవళిని అతిక్రమించినా.. తప్పును ఒప్పుకున్నందుకుగానూ.. దినేశ్ కార్తీక్‌ను మందలించి వదిలేశారు. ప్రవర్తనా నియమావళి లెవల్-1 ఉల్లంఘన విషయంలో మ్యాచ్ రిఫరీదే తుది నిర్మయం. ఎవ్వరైనా రిఫరీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్ దినేశ్ కార్తీక్.. 23 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ రజత్ పటీదార్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫలితంగా లక్నోపై బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. అంతకుముందు వాంఖడే వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి గెలవడంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగలిగింది.

ఈ సీజన్‌లో దినేశ్ కార్తీక్ 15 మ్యాచ్‌ల్లో 324 పరుగులు చేశాడు. నిలకడైన ప్రదర్శనతో త్వరలో దక్షిణాఫ్రికాతో భారత్‌కు జరగనున్న టీ20 సిరీస్‌లో జట్టులో స్థానాన్ని సంపాదించాడు. కార్తీక్ 187.28 సగటుతో 64.80 స్ట్రైక్ రేటుతో నిలకడగా రాణించాడు. అత్యధికంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్