RCB Team : ఆర్సీబీ నుంచి ఆ ఇద్దరూ ఔట్.. నెక్ట్స్ ఎవరు?-rcb management part ways with mike hesson and sanjay bangar lookout for news coaches ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rcb Management Part Ways With Mike Hesson And Sanjay Bangar Lookout For News Coaches

RCB Team : ఆర్సీబీ నుంచి ఆ ఇద్దరూ ఔట్.. నెక్ట్స్ ఎవరు?

Anand Sai HT Telugu
Jul 17, 2023 07:31 AM IST

RCB Team : ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశించిన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుని కోచింగ్‌ విభాగంలో మార్పు చేయాలని నిర్ణయించింది.

ఆర్సీబీ జట్టు
ఆర్సీబీ జట్టు (PTI)

వచ్చే ఐపీఎల్ కోసం ఆర్సీబీ(RCB) ఇప్పటి నుంచే కసరత్తులు మెుదలుపెట్టింది. అయితే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభమై పదహారు సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారి కూడా కప్ నెగ్గలేదు. మంచి టీమ్ ఉన్నా.. కప్ రాలేదు. మెున్నటి సీజన్ లోనూ ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. దీంతో ఆర్సీబీ యాజమాన్యం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కీలక మార్పులు చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

RCB టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ మైక్ హెసాన్(mike hesson), హెడ్ కోచ్ సంజయ్ బంగర్‌(sanjay bangar)ను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 2024 IPL మినీ వేలానికి ముందు RCB జట్టుకు కొత్త కోచ్, క్రికెట్ డైరెక్టర్‌ని నియమిస్తారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, డైరెక్టర్ మైక్ హెస్సన్ జట్టులో లేకపోవడం ఖాయం. అయితే ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ కూడా మారతాడా లేక కొనసాగుతాడా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

RCB క్రికెట్ డైరెక్టర్ హెస్సన్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ టీమ్ కోసం ఏళ్ల తరబడి పనిచేశారు. అయితే ఆర్‌సీబీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పటిష్టమైన జట్టు ఉన్నప్పటికీ, జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కప్ గెలవలేకపోయిన ప్రతిసారీ అభిమానుల ఆగ్రహానికి కారణం అవుతోంది. దీనిపై విరాట్ కోహ్లీ కూడా మండిపడ్డాడు. వచ్చే ఐపీఎల్‌లోపు గణనీయమైన మార్పు చేయాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది.

IPL 2024 మినీ-వేలం డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. దానికి ముందు కొత్త కోచ్, టిమ్ క్రికెట్ డైరెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. తదుపరి కోచ్ ఎవరు అనే ఉత్సుకత కూడా నెలకొంది. ఈసారి కూడా బ్యాటింగ్ కోచ్‌గా భారతీయుడిని నియమిస్తారా లేక విదేశీ కోచ్‌గా నియమిస్తారా అనేది చూడాలి.

జట్టులో కూడా మార్పు?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB) మంచి జట్టు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం తలనొప్పిగా మారింది. 2023 ఐపీఎల్‌లో రజత్ పాటిదార్, జోష్ హేజిల్‌వుడ్, రీస్ టాప్లీ, విల్ జాక్స్, వేన్ పార్నెల్ గాయపడటంతో జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. బౌలింగ్ విభాగంలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. 2024 IPLకి ముందు మినీ వేలం నిర్వహిస్తారు. ఆటగాళ్లు కూడా మారే అవకాశం ఉంది. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తదుపరి ఐపీఎల్‌లో ఆడడం అనుమానంగానే ఉంది.

WhatsApp channel