Ravi Shastri On Selections : అసలు సెలక్షన్స్ ఎలా జరుగుతాయో చూడాలని ఉంది-ravi shastri says he wants to see live broadcast of selection meetings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravi Shastri Says He Wants To See Live Broadcast Of Selection Meetings

Ravi Shastri On Selections : అసలు సెలక్షన్స్ ఎలా జరుగుతాయో చూడాలని ఉంది

HT Telugu Desk HT Telugu
May 16, 2023 10:04 AM IST

Team India Selections : టీమిండియా సెలెక్షన్‌ను లైవ్‌లో టెలికాస్ట్ చేస్తారా అంటూ మాజీ హెడ్ కోచ్, లెజెండరీ ప్లేయర్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు సెలక్షన్స్ ఎలా జరుగుతాయో తనకు కూడా చూడాలని ఉందని తెలిపాడు.

రవిశాస్త్రి
రవిశాస్త్రి (Twitter)

కిందటి ఏడాది టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా(Team India) పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తన గ్రూప్ లోని బలహీన జట్ట మీద విజయాలు సాధించిన భారత జట్టు.. సెమీ ఫైనన్ లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ(BCCI Selection Committee)పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కారణాలతో అప్పటి సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మను పదవి నుంచి తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు

ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ అతడిని పదవిలో నియమించారు. తర్వాత జరిగిన స్టింగ్ ఆపరేషన్లో బీసీసీఐ(BCCI)కి సంబంధించిన పలు అంశాలపై చేతన్ శర్మ నోరు జారాడు. తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో తాను టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా సెలక్షన్ కమిటీ మీటింగ్ లో పాల్గొనలేదని రవిశాస్త్రి వెల్లడించాడు.

అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశాలను కూడా బ్రాడ్ కాస్ట్ చేయాలని కొందరు బీసీసీఐ అధికారులు అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్, లెజెండరీ ప్లేయర్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ మీటింగ్స్ ఎలా జరుగుతాయో.. తనకు కూడా చూడాలని ఉందని, వీటిని బ్రాడ్ కాస్ట్ చేయడం చాలా మంచి నిర్ణయం అని చెప్పాడు.

ప్రస్తుతం బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చీఫ్ గా శివ్ సుందర్ దాస్ బాధ్యతలు చూస్తున్నాడు. ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ ముగిసిన తర్వాత కొత్త సెలక్షన్ కమిటీ చీఫ్ ను బీసీసీఐ ఎన్నుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ మీటింగ్స్ కూడా బ్రాడ్ కాస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

'లైవ్ లో సెలెక్షన్ కమిటీ మీటింగ్ చూడాలనేది నా కల. సెలెక్షన్ మీటింగ్ జరిగేటప్పుడు బాక్సాఫీస్ ఎలా బద్దలవుతుందో ఊహించగలరా? సెలెక్టర్లు కూడా చాలా నిబద్ధతతో పనిచేయాల్సి వస్తుంది. జట్టు ఎంపికలో పారదర్శకత ముఖ్యం అనుకుంటే త్వరలోనే ఇది జరిగి తీరుతుంది. సెలెక్షన్ మీటింగ్ బ్రాడ్‌కాస్ట్ హక్కులను కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. దానితో వచ్చే ఆదాయం వల్ల సెలెక్టర్ల జీతాలు కూడా ఐదు రెట్లు పెరుగుతాయి.' అని రవిశాస్త్రి అన్నాడు.

WhatsApp channel

టాపిక్