Rain stops ind vs ban match: ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. డీఎల్‌ఎస్ స్కోరులో బంగ్లాదే పైచేయి
Rain stops ind vs ban match: ఇండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలింది. అయితే ఆ సమయానికి డీఎల్‌ఎస్ స్కోరులో బంగ్లాదేశ్ పైచేయి సాధించడం భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
Rain stops ind vs ban match: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య అడిలైడ్‌లో జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డు తగిలింది. 185 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కూడా దీటుగా ఆడుతోంది. వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి ఆ టీమ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 రన్స్ చేసింది. డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ స్కోరు ప్రకారం కూడా బంగ్లాదేశ్ ప్రస్తుతం 17 పరుగులు ముందు ఉండటం గమనార్హం.
ట్రెండింగ్ వార్తలు
ఇది ఇండియన్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతడు కేవలం 26 బాల్స్‌లోనే 59 రన్స్ చేసి అజేయంగా ఉన్నాడు. దాస్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఏ ఇండియన్ బౌలర్‌ను కూడా లిటన్ వదల్లేదు. షమి 2 ఓవర్లలో 21, భువనేశ్వర్ 3 ఓవర్లలో 27, అర్ష్‌దీప్ 1 ఓవర్లో 12 రన్స్ సమర్పించుకున్నారు.
అడిలైడ్‌లో మ్యాచ్ రోజు 70 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ముందే వాతావరణ శాఖ తెలిపింది. ఇండియా బ్యాటింగ్ సమయంలో వర్షం కురవకపోయినా.. బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో ఒక్కసారి ఏడో ఓవర్ ముగియగానే భారీ వర్షం పడింది. దీంతో మ్యాచ్‌ను నిలిపేయాల్సి వచ్చింది.