Pro Kabaddi Season 9 Full Schedule: ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 ఫుల్ షెడ్యూల్ ఇదే
Pro Kabaddi Season 9 Full Schedule: కబడ్డీ అభిమానులను అలరించేందుకు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9 వచ్చేసింది. 9వ సీజన్ కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ ఎప్పుడూ మొదలుకానుందంటే...
Pro Kabaddi Season 9 Full Schedule: కబడ్డీ ఆటకు ప్రో కబడ్డీ లీగ్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది సీజన్స్ పూర్తయ్యాయి. తాజాగా తొమ్మిదో సీజన్ అక్టోబర్ లో మొదలుకానుంది. తాజా సీజన్ కు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 9 మొదలుకానుంది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 8 వరకు మొత్తం నెల రోజుల పాటు కబడ్డీ అభిమానులను అలరించనున్నది. బెంగళూరు, హైదరాబాద్, పూనే వేదికలుగా మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
టైటిల్ కోసం తెలుగు టైటాన్స్, యు ముంబా, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్, హర్యానా స్టీలర్స్, పూణేరి ఫల్టాన్, తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్, బెంగాళ్ వారియర్స్, బెంగళూరు బుల్స్, పాట్నా పైరెట్స్ మొత్తం 12 జట్లు పోటీపడనున్నాయి. తొలిరోజు అక్టోబర్ 7న మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మొదటి మ్యాచ్ లో గత ఏడాది టైటిల్ విన్నర్ దబాంగ్ ఢిల్లీతో యు ముంబా తలపడనున్నది. అదే రోజు తెలుగు టైటాన్స్ తన తొలి మ్యాచ్ లో బెంగళూరు బూల్స్ తో ఆడనున్నది. జైపూర్ పింక్ ఫాంథర్స్, యూపీ యోధాస్ మధ్య మరో మ్యాచ్ జరుగనున్నది. గత సీజన్ లో తెలుగు టైటాన్స్ పూర్తిగా నిరాశపరిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు ప్లేస్ లో నిలిచింది.
గత సీజన్ లో గాయంతో చాలా మ్యాచ్ లకు కెప్టెన్ సిద్ధార్థ్ దేశాయ్ దూరం కావడం తెలుగు టైటాన్స్ ను దెబ్బకొట్టింది. ఈ సారి అతడు రాణించడంపైనే తెలుగు టైటాన్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. గత సీజన్ లో దబాంగ్ ఢిల్లీ విజేతగా నిలిచింది.