Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్ వచ్చేస్తోంది.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు
Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్ వచ్చేస్తోంది. తొలి ఎనిమిది సీజన్ల పాటు ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించిన ఈ లీగ్.. 9వ సీజన్ కోసం ఈ మధ్యే ప్లేయర్స్ వేలం కూడా పూర్తి చేసుకుంది.
Pro Kabaddi League: గ్రామీణ క్రీడ కబడ్డీని ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లడమే కాదు.. ప్లేయర్స్‌పై కాసుల వర్షం కురిపిస్తోంది ప్రొ కబడ్డీ లీగ్. ఇండియాలో ఐపీఎల్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన లీగ్‌గా పీకేఎల్ నిలవడం విశేషం. ఈ లీగ్ కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభమైనా సరే ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు నుంచి మూడు నెలల పాటు టీవీలకు అతుక్కుపోతున్నారు.
ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ప్రొ కబడ్డీ లీగ్.. ఇప్పుడు 9వ సీజన్‌తో మరోసారి ఫ్యాన్స్ ముందుకు రాబోతోంది. అక్టోబర్ 7 నుంచి పీకేఎల్ 9వ సీజన్ ప్రారంభం కానున్నట్లు ఆర్గనైజర్ మాషల్ స్పోర్ట్స్ శుక్రవారం (ఆగస్ట్ 26) అనౌన్స్ చేసింది. ఈ టోర్నీ లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, పుణెల్లో జరగనున్నట్లు చెప్పారు.
గత సీజన్‌లో కరోనా కారణంగా అభిమానులను స్టేడియాలకు అనుమతించలేదు. ఈసారి మాత్రం ఫ్యాన్స్ ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడొచ్చు. దీంతో ఈ కొత్త సీజన్ కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ప్రొ కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి చెప్పారు. కబడ్డీని సమకాలీన క్రీడలకు సరిసమానంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రారంభించిన లీగ్‌ను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు.
"గ్రామీణ క్రీడ అయిన కబడ్డీని సమకాలీన స్పోర్ట్స్‌కు సరి సమానంగా ఉంచడంతోపాటు ఈ తరం స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో మాషల్ స్పోర్ట్స్ పీకేఎల్‌ను ప్రారంభించింది. ఈ లక్ష్యం దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఈసారి బెంగళూరు, హైదరాబాద్, పుణెల్లో ఫ్యాన్స్ స్టేడియాలకు రానున్నారు" అని అనుపమ్ చెప్పారు. రానున్న రోజుల్లో పీకేఎల్ సీజన్ 9 షెడ్యూల్, ఇతర వివరాలను వెల్లడిస్తామని అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్