PKL Auctions 2022: ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం.. ఎప్పుడు? లైవ్‌ ఎక్కడ చూడాలి?-pro kabaddi league players auctions to be held on august 5th and 6th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pro Kabaddi League Players Auctions To Be Held On August 5th And 6th

PKL Auctions 2022: ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం.. ఎప్పుడు? లైవ్‌ ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu
Aug 04, 2022 04:07 PM IST

PKL Auctions 2022: ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్‌ కోసం ప్లేయర్స్ వేలానికి టైమ్‌ దగ్గర పడింది. మరి ఈ వేలం ఎప్పుడు, ఎక్కడ జరగనుంది? టీవీలో లైవ్‌ వస్తుందా? ప్లేయర్స్‌ బేస్‌ ప్రైస్‌ ఎంతలాంటి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్ వేలానికి టైమ్ దగ్గరపడింది
ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్ వేలానికి టైమ్ దగ్గరపడింది (PKL Twitter)

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌.. ఇండియాలో ఐపీఎల్‌ తర్వాత ఆ రేంజ్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న లీగ్‌ ఇది. మన దేశ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ గ్లోబల్ లెవల్లో ఈ లీగ్‌ ద్వారా సత్తా చాటింది. కబడ్డీ ప్లేయర్స్‌ కూడా వేలు, లక్షలు కాదు.. కోట్లు అందుకున్నారంటే అది పీకేఎల్‌ ఘనతే. ఈ కబడ్డీ లీగ్‌ ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ప్లేయర్స్‌ వేలం జరగబోతోంది.

ట్రెండింగ్ వార్తలు

పీకేఎల్‌ వేలం ఎప్పుడు?

ప్రొ కబడ్డీ లీగ్ 9వ సీజన్‌ కోసం ప్లేయర్స్‌ వేలం ముంబైలో ఆగస్ట్‌ 5-6 తేదీల్లో జరగనుంది. మొత్తం 12 టీమ్స్‌ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీ పడనున్నాయి. ఈ వేలంలో భాగంగా ప్లేయర్స్‌ను వివిధ కేటగిరీలుగా విభజించారు.

ఏ కేటగిరీ ప్లేయర్‌ బేస్‌ ప్రైస్‌ ఎంత?

కబడ్డీ ప్లేయర్స్‌లో డొమెస్టిక్‌, ఓవర్సీస్‌, న్యూ యంగ్‌ ప్లేయర్స్‌లను నాలుగు కేటగిరీలుగా విభజిస్తారు. ఇందులోనే మళ్లీ ప్లేయర్స్‌ను ఆల్‌రౌండర్లు, డిఫెండర్లు, రైడర్లుగా డివైడ్‌ చేస్తారు. కేటగిరీ ఎలో ఉన్న ప్లేయర్స్‌కు అత్యధికంగా బేస్‌ ప్రైస్‌ రూ.30 లక్షలుగా ఉంటుంది. ఇక బిలో ఉండే వాళ్ల బేస్‌ ప్రైస్‌ రూ.20 లక్షలు, సీలో ఉండే వాళ్లకు రూ.10 లక్షలు, డీలో ఉండేవాళ్లకు రూ.6 లక్షలు ఉంటుంది.

ఒక్కో టీమ్‌ ఖర్చు పరిమితి ఎంత?

ప్రొ కబడ్డీ లీగ్‌లోని మొత్తం 12 టీమ్స్‌ ప్లేయర్స్‌ కోసం పోటీ పడతాయి. ఒక్కో టీమ్‌ గరిష్ఠంగా రూ.4.4 కోట్లు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఐపీఎల్‌లాగే ముందుగా గత సీజన్‌లో తమతో ఉన్న ప్లేయర్స్‌ను రిటేన్‌ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ మేరకు వేలానికి ముందే వాళ్ల పర్స్‌ నుంచి ఆ మొత్తాన్ని కోత విధిస్తారు. ఒక్కో టీమ్‌ గరిష్ఠంగా ఆరుగురు ప్లేయర్స్‌ను రిటేన్‌ చేసుకోవచ్చు.

ఇక ఒక్కో టీమ్‌ కనీసం 18 ప్లేయర్స్‌ నుంచి గరిష్ఠంగా 25 మంది ప్లేయర్స్‌ను కలిగి ఉండవచ్చు. ఈ ప్రొ కబడ్డీ లీగ్ వేలాన్ని స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తోంది. దీనికి డిస్నీ+హాట్‌స్టార్‌లోనూ చూడొచ్చు. ఆగస్ట్‌ 5-6 తేదీల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి వేలం మొదలవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్