Poland vs Saudi Arabia FIFA 2022: సౌదీని చిత్తు చేసిన పోలాండ్.. సునాయస విజయం-poland defeat with 2 0 against saudi arabia in fifa world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Poland Defeat With 2-0 Against Saudi Arabia In Fifa World Cup 2022

Poland vs Saudi Arabia FIFA 2022: సౌదీని చిత్తు చేసిన పోలాండ్.. సునాయస విజయం

Maragani Govardhan HT Telugu
Nov 26, 2022 09:30 PM IST

Poland vs Saudi Arabia FIFA 2022: ఫిఫా ప్రపంచకప్ 2022లో భాగంగా సౌదీ అరేబియాపై పోలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 2-0 తేడాతో గెలిచింది. ఫలితంగా గ్రూప్-సీలో అగ్రస్థానానికి చేరుకుంది.

సౌదీ అరేబియాపై పోలాండ్ ఘనవిజయం
సౌదీ అరేబియాపై పోలాండ్ ఘనవిజయం (AFP)

Poland vs Saudi Arabia FIFA 2022: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా నేడు సౌదీ అరేబియా-పోలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై పోలాండ్ 2-0 తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా లాంటి అగ్రస్థాయి జట్టును ఓడించి ఆత్మవిశ్వాసంలో బరిలోకి దిగిన సౌదీ అరేబియా.. పోలిష్ జట్టు ముందు తేలిపోయింది. కనీసం ఒక్క గోల్ కూడా నమోదు చేయకుండానే తోక ముడిచింది. ఫలితంగా గ్రూప్-సీలో పోలాండ్ అగ్రస్థానానికి చేరుకుంది.

ట్రెండింగ్ వార్తలు

పోలాండ్ ప్లేయర్ 39వ నిమిషంలోనే గోల్ సాధించి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. అనంతరం 82వ నిమిషంలో కెప్టెన్ రాబర్ట్ లెవాండోస్కీ రెండో గోల్‌తో పోలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన పోలిష్ జట్టు.. ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టింది.

ఆట తొలి అర్ధభాగకంలోనే 39వ నిమిషంలో జిలెన్ స్కీ తొలి గోల్ సాధించిన అనంతరం సౌదీ అరేబియాకు ఫెనాల్టీ లభించింది. దీంతో గోల్ కచ్చితంగా సాధిస్తుందనుకున్న సమయంలో పోలాండ్ గోల్ కీపర్ వోజిక్స్ జెన్నీ రెండు సార్లు అద్భుతంగా అడ్డుకుని సౌదీ ఆశలపై నీళ్లు చల్లాడు. ఆ తర్వాత సెకాండాఫ్‌లోనూ పోలాండ్ గోల్ పోస్టుపై సౌదీ జట్టు ఎదురుదాడి చేసినప్పటికీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు.

ఇక చివర్లో పోలాండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాండాస్కో గోల్ కొట్టి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై 2-0 తేడాతో పోలాండ్ విజయం సాధించింది. తొలి ప్రపంచకప్ ఆడుతున్న లెవాండోస్కీ ఇదే మొదటి గోల్ కావడం గమనార్హం. ఈ విజయంతో పోలాండ్ జట్టు గ్రూప్-సీలో 3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

WhatsApp channel

సంబంధిత కథనం