Paul Valthaty Retirement: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఐపీఎల్ స్టార్ పాల్ వాల్తాటీ - ఈ తెలుగు క్రికెటర్ రికార్డులు ఇవే!
Paul Valthaty Retirement: తెలుగు క్రికెటర్ పాల్ వాల్తాటీ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2011 ఐపీఎల్ సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఓ సెంచరీ చేశాడు.
Paul Valthaty Retirement: ఫస్ట్ క్రికెట్‌కు సోమవారం రిటైర్‌మెంట్ ప్రకటించాడు ఐపీఎల్ ప్లేయర్ పాల్ వాల్తాటీ. స్వతహాగా తెలుగు మూలాలున్న ఈ ఆటగాడు దేశవాళీ క్రికెట్‌లో ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్‌తో పాటు పంజాబ్ కింగ్స్ టీమ్ తరఫున బరిలో దిగాడు. 2011 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 63 బాల్స్‌లో 120 రన్స్ చేయడంతో పాల్ వాల్తాటీ ఒక్కసారిగా హీరోగా మారాడు. 2011 సీజన్‌లో ఫస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
అతడి మెరుపులతో మరో ఐదు బాల్స్ మిగిలుండగానే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో 47 బాల్స్‌లోనే 75 రన్స్‌తో చెలరేగాడు. అదే సీజన్‌లో ఓ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2011 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో ఒకడిగా పాల్ వాల్తాటీ నిలిచాడు. పాల్ వాల్తాటీ మెరుపులు 2011 ఒక్క సీజన్‌కు మాత్రమే పరిమితమయ్యాయి.
ఆ తర్వాతి సీజన్‌లో ఫామ్ కోల్పోవడంతో అతడి కెరీర్‌కు అడ్డంకిగా మారింది. 2012, 2013 సీజన్‌లలో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన పాల్ వాల్తాటీ పెద్దగా రాణించలేకపోవడంతో ఆ తర్వాత తెరమరుగైపోయాడు. కంటి గాయం కూడా అతడి కెరీర్‌ను దెబ్బతీసింది. అండర్ 19 వరల్డ్ క్రికెట్‌లో ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్ వంటి ప్లేయర్స్‌తో ఆడాడు పాల్ వాల్తాటీ.
టాపిక్